ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Flowering plant : ఈ మొక్కగానీ ముట్టుకున్నారో అంతే.. ఇక తిన్నారంటే ప్రాణాలే పోతాయ్.. పొరపాటున కూడా అటుపోకండి.!

ABN, First Publish Date - 2023-10-21T11:50:37+05:30

ఈ మొక్క ప్రతి భాగం విషపూరితమైందే.. దీనిని తిన్న జంతువులు, మానవులు కూడా మరణిస్తారు. అందమైన గులాబీ, ఊదా తెల్లని రంగుల్లో ఈ పూలు పూస్తాయి. ఈ పువ్వుల ఆకారం ట్రంపెట్ లాగా ఉంటుంది.

Flowering plant

పూలు ప్రకృతిలోని ప్రతి అందానికి ఓ ప్రత్యేకత ఉంది. పూలను చూసిన ప్రతి సారీ ప్రకృతి అందం మరింత పెరుగుతుంది అనిపిస్తుంది. చాలా రకాల పూలు మన చుట్టూ ఉన్నాయి. ప్రతి పువ్వుకూ ఓ ప్రత్యేకత ఉంది. అయితే తెలుగులో పూల అందం మీద ఎన్నో కవితలు, పాటలు కూడా పుట్టుకొచ్చాయి. అలాంటి పూల గురించి ఎంత ఎక్కువగా చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అయితే పూల మొక్కల్లో కొన్ని విషపు జాతి మొక్కలు కూడా లేకపోలేదు. అసలు వివరాల్లోకి వెళితే..

ఈ పువ్వు మానవులకు విషపూరితమైంది. ఫాక్స్ గ్లోవ్ అనే ఈ పువ్వుని డిజిటల్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ప్రతి భాగం విషపూరితమైందే.. దీనిని తిన్న జంతువులు, మానవులు కూడా మరణిస్తారు. అందమైన గులాబీ, ఊదా తెల్లని రంగుల్లో ఈ పూలు పూస్తాయి. ఈ పువ్వుల ఆకారం ట్రంపెట్ లాగా ఉంటుంది. ఈ పువ్వు చనిపోయిన వారిని లేపగలదు, జీవించ ఉన్నవారిని చనిపోయేలా చేస్తుందనే ఇంగ్లీష్ సామెత కూడా ఉంది.

నిపుణులు ఏమంటున్నారు..

బఫెలోలోని స్టేట్ యూనివర్మ ఏమన్నారంటే.. ఫాక్స్ గ్లోవ్ లో కార్టియాక్ గ్లైకోసైడ్స్ అని పిలిచేవారు ఇవి అత్యంత శక్తివంతమైన సమ్మేళనాలు.. ఇవి గుండె ఆరోగ్యానికి హానికరం. ఈ సమ్మేళనాలు వెంట్రిక్యూలర్ ఫిబ్రిలేషన్ కు కారణమవుతాయి. దీని కారణంగానే కార్టియాక్ అరెస్ట్ కారణంగా వ్యక్తి చనిపోయే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: కూరల్లో ముల్లంగి తినేది తక్కువేనా.. అయితే చాలా నష్టపోతున్నట్టే.. ముల్లంగిని తరచుగా తింటే..!!


గుండె వేగంగా కొట్టుకుంటుందా..

ఈ కణాల పొరలు వేర్వేరు అయాన్ చానెల్స్, ట్రాన్స్ పోర్టర్ లను కలిగి ఉంటాయని లైవ్ సైన్స్ నివేదిస్తుంది. గుండె వైఫల్యానికి డిగోక్సిన్ చాలా ప్రభావవంతమైన చికిత్స అయినప్పటికీ, ఒక వ్యక్తి అనుకోకుండా మొక్కలోని ఏదైనా భాగాన్ని తింటే, వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ఎందుకంటే ఈ మొక్క అన్ని భాగాలు విషపూరితమైనవి. ఇది తీసుకుంటే కనుక వికారం, చర్మం చికాకు, తలనొప్పి, అతిసారం, అస్పష్టమైన దృష్టి, వాంతులు, మైకము, అధిక మూత్రవిసర్జనకు కారణం కావచ్చు. ఇది కాకుండా, వ్యక్తి అలసట, కండరాల బలహీనత , వణుకు, గందరగోళం, మూర్ఛలు, అసాధారణ హృదయ స్పందన, తక్కువ రక్తపోటు మరణం కలిగే అవకాశం ఉంది.

Updated Date - 2023-10-21T11:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising