Almonds: చలికాలంలో రోజూ బాదంపప్పు తీసుకోవడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు..
ABN, Publish Date - Dec 25 , 2023 | 11:57 AM
బాదం ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. ఇది జీర్ణ క్రియకు సహకరిస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
బాదం పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం. మామూలుగా జీడిపప్పు కన్నా కూడా బాదం అల్పాహారంలో తీసుకునేందుకు ఇష్టపడతారు. బాదం పప్పు మాత్రమే కాకుండా బాదం వెన్న, బాదం పాలు, సలాడ్స్ లలో కలిపి తీసుకుంటారు. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు సంవృద్ధిగా ఉన్నాయి. మొత్తం ఆరోగ్యానికి సపోర్ట్ చేసే రోగనిరోధక శక్తిని పెంచే విధంగా బాదం మంచి సపోర్ట్ గా నిలుస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఇక చలికాలంలో బాదం పప్పును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. ఇటువంటి ఆహారాన్ని శీతాకాలంలో తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలుంటాయంటే..
పోషకాహారం..
బాదంపప్పులో ఉండే పోషకాలు ఆరోగ్యకరమైన కొవ్వులు చలికాలంలో మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యంగా పనిచేస్తాయి.
గుండెకు బలం..
బాదం ఈ కాలంలో ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు అందుతాయి. ఇందులోని సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండి, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తుంది.
మెదడు పనితీరు..
బాదంలోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడంట్లు, ఒమేగా 3, ఫ్లాటీ యాసిడ్స్ తో సహా అన్ని పోశకాలు మెదడు పనితీరులో కీలకంగా పనిచేస్తాయి. తెలివి తేటలను పెంచడంలోనూ బాదం మెరుగ్గా పనిచేస్తుంది.
రోగ నిరోధక శక్తి..
బాదంలో ఉండే విటమిన్లు, పోషకాలు జలుబుస ఫ్లూ వంటి లక్షణాలను దూరం చేయడంలో సహకరిస్తుంది. చాలా రకాల వ్యాధులతో పోరాడేందుకు శీతాకాలంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకరిస్తుంది.
ఇది కూడా చదవండి: పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేస్తూ.. ఈ విషయాలను మాత్రం మరిచిపోకండి..!
బరువు తగ్గడంలోనూ..
క్యాలరీలు ఎక్కువగా ఉన్న బాదాన్ని తీసుకోవడం వల్ల బరువును తగ్గించడంలో సహకరిస్తుంది. బాదంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు సంతృప్తిగా ఉన్నాయి. ఇవి అతిగా తినే అలవాటును తగ్గించడంలో, బ్యాలెన్స్ డైట్ తీసుకునే విధంగా ప్రోత్సహిస్తాయి. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియ..
బాదం ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. ఇది జీర్ణ క్రియకు సహకరిస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
చర్మం నిగారింపు..
బాదంపప్పులో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, చర్మాన్ని నిగారింపుతో, కాంతి వంతంగా ఉంచేందుకు సహకరిస్తాయి. మెరిసే చర్మం కావాలంటే రోజూ నాలుగు నుంచి ఆరు బాదం పప్పులను నీటిలో రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 25 , 2023 | 11:58 AM