ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ashoka Tree: ఊళ్లల్లో కనిపించే ఈ చెట్లను పెద్దగా పట్టించుకోరు కానీ.. సరిగ్గా వాడుకుంటే ‘మెడికల్ మిరాకిల్స్’ ఖాయం..!

ABN, First Publish Date - 2023-10-05T12:24:14+05:30

అశోక చెట్టు ఆయుర్వేద దృక్కోణంలో ఒక ఔషధ మొక్క, దాని ఆకులను పేస్ట్ చేసి రాయడం వల్ల కీళ్ల నొప్పులు, ముఖ ముడతలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

Plants

ప్రకృతిలో లభించే చాలా మొక్కల్లో బోలెడు ఔషద గుణాలున్నాయి. వీటిని గురించి తెలిసేది చాలా తక్కువమందికే. సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రకృతి కన్నా మంచి వైద్యుడు మరొకరు లేరు. పాతకాలంలో ప్రతి ఇంటి గుమ్మం, వాకిలి ముందు పెద్దగా నిటారుగా పెరిగి గాలికి వచ్చినపుడు తలలూపే చెట్లను మనలో చాలా మంది చూసే ఉంటారు. వాటిని సరిగ్గా గమనించి ఇంట్లో పెద్దవాళ్లని అడిగితే అశోక చెట్లని చెప్పే ఉంటారు. వీటిని గురించి ఇంతకు మించి మనకు తెలిసింది చాలా తక్కువే. అయితే ఈ మొక్కలో చాలా ఔషద గుణాలున్నాయని, ఇది చాలా రోగాలకు మందుగా పనిచేస్తుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ మొక్క గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ప్రజలు ఇప్పటికీ పాత సంప్రదాయాలు, ఆచారాలకు కట్టుబడి ఉన్నారు. దామోహ్ జిల్లాలోని చాలా ఇళ్ల వెలుపల అశోక చెట్టు కనిపించడానికి కారణం ఇదే. హిందూ గ్రంథాలలో అశోక వృక్షానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. అశోక వృక్షాన్ని నాటడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అశోక వృక్షం ఉన్న ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం ఉంటాయి. ఈ చెట్టు ఆకుల నివారణ భార్యాభర్తల మధ్య ప్రేమను కూడా పెంచుతుందని ఇక్కడి వారు చాలా ఎక్కవగా విశ్వశిస్తారు.

ఆయుర్వేదంలో దీనికి విశేష ప్రాధాన్యత ఉంది..

అశోక చెట్టు ఆయుర్వేద దృక్కోణంలో ఒక ఔషధ మొక్క, దాని ఆకులను పేస్ట్ చేసి రాయడం వల్ల కీళ్ల నొప్పులు, ముఖ ముడతలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఔషధ మొక్క మొటిమలను నయం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాదు మధుమేహ వ్యాధిగ్రస్తులు దీని ఆకులను తీసుకుంటే ప్రయోజనం కూడా లభిస్తుంది.

ఇది కూడా చదవండి: పెదవులకు దగ్గరగా ఓ మొటిమ.. చూడటానికి బాగాలేదని చిదిమేసిన మహిళ.. మర్నాడు నిద్రలేచిన తర్వాత చూస్తే..!

ఇది స్త్రీలకు వరం

ఆయుర్వేద ఔషధం డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారం.. అశోక మొక్క ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా స్త్రీలకు ముఖ సౌందర్యం, మోకాలి కీళ్ల నొప్పులు మొదలైన చర్మ సంబంధిత చికిత్సకు అశోక వృక్షం బాగా పనిచేస్తుంది.

Updated Date - 2023-10-05T12:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising