Coconut: కొబ్బరి కాయను సరిగ్గా సగానికి పగలగొట్టేందుకు అదిరిపోయే టెక్నిక్.. లోపల ఉన్న కొబ్బరిని కూడా ఈజీగా తీయాలంటే..!
ABN, First Publish Date - 2023-12-01T15:39:13+05:30
కొబ్బరి ఎంత కమ్మని రుచి సరే.. కానీ కాయను పగలగొట్టేందుకు రెడీ చేయడం అంత కష్టం.
కొబ్బరికాయ చాలావరకూ మన ఇళ్ళల్లో చాలా ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కొబ్బరికాయను ఒలిచి, పగలగొట్టి, తర్వాత కోరుగా కోరడం వరకూ అన్నీ కష్టమైన పనులే.. అయితే కొబ్బరి చాలా ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరి ఎంత కమ్మని రుచి సరే.. కానీ కాయను పగలగొట్టేందుకు రెడీ చేయడం అంత కష్టం. పై పీచును తీయడం ఓ పనైతే, కొబ్బరి కాయను పగలగొట్టి పెంకునుంచి గుజ్జును వేరుచేయడం మరో పెద్ద పని, పూజలు, వ్రతాలు, వంటలలో కొబ్బరి ముఖ్యమైన పదార్ధంగా తయారయినా దీనిని పగలగొట్టే విధానంలో మాత్రం చాలా కష్టం ఉంది. దీనికోసం..
కొబ్బరిలోపలి భాగం ఎంత రుచిగా ఉంటుందో ఓలిచే విధానం అంత కష్టంగా ఉంటుంది. అయితే కొబ్బరిని తీసేందుకు చాకులతో, స్పూన్స్ తో చాలా అవస్తలు పడుతూ ఉంటాం. తీరా కొబ్బరి తీసాకా.. దానిని మిక్సీలో వేయడం కూడా కష్టమే.. చిన్న ముక్కలు కోసినా కూడా ఒక్కోసారి మిక్సీలో నలగవు. దీనికి పరిష్కారం మాత్రం కోరుగా కోరుకోవడమే. అయితే కాయను ఒలిచే విధానంలో మాత్రం చేతులకు మరీ శ్రమ లేకుండా చేయాలంటే ఈ ఒక్క విధానమే బెటర్.. అదేమిటంటే.
ఇది చదవండి: దగ్గు, జలుబు వంటివి చలికాలంలో అస్సలు రాకుండా ఉండాలంటే.. ఈ చిన్న పని చేయండి చాలు..!
కొబ్బరి కాయను పగలగొట్టే ముందే పైన ఉండే గట్టి పెంకులను తీసేయాలి. లేదా స్టవ్ మీద కాస్త వేడిచేసి కాయను 30 నుంచి 35 నిమిషాలు అలాగే ఉంచి, ఆతర్వాత పగలగొట్టినా సరే ఈ పని సులువు అవుతుంది. ఇలా చేసిన తర్వాత కొబ్బరికాయను పగలగొడితే.. చేతులకు శ్రమ తగ్గుతుంది. ఈసారి కొబ్బరి చెట్నీ, కొబ్బిరి పచ్చడి, కూరలలో వాడే పని పెట్టుకుంటే మాత్రం కొబ్బరికాయను ఇలా సులువుగా పగలగొట్టి, తీసుకోండి.
Updated Date - 2023-12-01T15:39:15+05:30 IST