Breast size: చాలామంది మహిళలను ఆత్మనూన్యతలోకి తోసేసే మానసిక సమస్య ఇదే..!
ABN, First Publish Date - 2023-07-31T10:36:50+05:30
అసంతృప్తిగా ఉన్న వక్షోజాల పరిమాణం వల్ల జీవితభాగస్వామి ఆసక్తి చూపించకపోవడం, దగ్గరకు తీసుకోకపోవడం, ఇతరులను చూపించి పోల్చడం, ఎగతాళి చేసి మాట్లాడటం వంటివి చేస్తుంటారు.
పెద్దవైనా చిన్నవైనా, వక్షోజాల అన్ని ఆకారాలు, పరిమాణాలలో అందంగా ఉంటాయి. కొందరిలో శరీర తత్వానికి తగ్గట్టుగా ఈ పరిమాణం ఉంటే కొందరిలో వీటికోసం, సరైన ఆకారానికి పెరగాలని తపించేవారు కూడా ఉంటారు. అయితే వక్షోజాల పెరుగుదల, తగ్గుదల మనచేతుల్లో ఉండదు. కొంతమంది మహిళలు పెద్ద వక్షోజాలను కలిగి ఉండటానికి ఇష్టపడతారు. ఇది వారికి మరింత విశ్వాసాన్ని ఇస్తుంది. అలాగే వారిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. కారణం ఏమైనప్పటికీ, చిన్న వక్షోజాలున్నవారిలో పెరుగుదల అనేది అంత సులువుగా అయితే జరగదు. ఇలా లేకపోవడానికి కారణాలను వెతుకుతూ, ఆత్మనూన్యతతో కుచించుకుపోయేవారూ ఉంటారు. అయితే ఇలా ఎందకు జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం.
ఒక వయసు వచ్చినప్పటి నుండి పెళ్ళై పిల్లలు పుట్టి మధ్యవయసు దాటే వరకు ఆడవాళ్లు లోలోపల ఎక్కువగా బాధపడుతున్న అంశాలలో ముఖ్యమైనది వారి వక్షోజాల పరిమాణం గురించి అనే విషయం తెలిస్తే ఆశ్చర్యం వేసినా ఇదే ముమ్మాటికీ నిజం. ప్రపంచ దేశాలలో అన్ని చోట్లా మహిళలు ఈ వక్షోజాల పరిమాణం అనే అంశం గురించి సతమతమవుతున్నారు. వక్షోజాల పరిమాణం మరీ పెద్దగా ఉండటం కొందరి సమస్య అయితే, చాలా చిన్న పరిమాణం కలిగి ఉండి ఆత్మన్యూనతా భావానికి లోనయ్యేవాళ్ళు మరికొందరు.
ఇది కూడా చదవండి: ఈ ఒక్క కాయలో ఇంత మహత్యమా..? పెరిగిన వయసునూ దాచేస్తుంది. జుట్టు సమస్యలకూ చెక్..
ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సర్వేలో 40 దేశాల నుండి సుమారు 18,500 మంది మహిళలు పాల్గొన్నారు. వీళ్ళలో 48% మహిళలు ప్రస్తుతం తమకు ఉన్న పరిమాణం కంటే పెద్ద పరిమాణం వక్షోజాలు ఉంటే బాగుంటుందనే విషయాన్ని తెలిపారు. 23% మహిళలు చాలా చిన్న పరిమాణం వక్షోజాలు కలిగి ఉన్నట్టు తెలింది, కేవలం 29% మహిళలు మాత్రమే తమ వక్షోజాల విషయంలో సంతృప్తిగా ఉన్నట్టు సర్వేలో నమోదు చేశారు. ఈ సర్వే మొత్తం 34 సంవత్సరాల నిర్ణీత వయసు కలిగిన మహిళల ద్వారా జరిగింది.
వక్షోజాల పరిమాణం విషయంలో అసంతృప్తిగా ఉన్న మహిళలు వక్షోజాలను పరిశీలించుకునే అవకాశం తక్కువ ఉంటుంది. వక్షోజాలను అప్పుడప్పుడు శ్రద్దగా పరిశీలించుకోకపోతే మహిళల్లో పెద్ద సమస్యగా చెప్పుకునే బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడం కష్టమవుతుంది. ఈ నిర్లక్ష్యం వల్ల చాలామంది మహిళలు ఒక స్టేజి దాటిపోయిన తరువాత వైద్యుల దగ్గరే ఈ సమస్యను తెలుసుకోగలుగుతున్నారు.
ఇకపోతే వక్షోజాల పరిమాణం మీద అసంతృప్తిగా ఉన్న మహిళలు పర్సనల్ లైఫ్ విషయంలో కూడా అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పడం బాధాకరమైన విషయం. వక్షోజాల పరిమాణం పెద్దగా ఉన్నా లేదా చిన్నగా ఉన్నా చుట్టూ ఉన్నవారినుండి బాడీ షేమింగ్ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ బాడీ షేమింగ్ మహిళలను ఒత్తిడిలోకి నెడుతుంది. కొందరు దీనివల్ల యాంగ్జిటికి లోనవుతుంటారు. మంచి బట్టలు వేసుకోవడం దగ్గర నుండి, నలుగురిలో కలవడం వరకు అన్ని విషయాల్లో భయపడుతూ ఉంటారు.
ఈ విషయం గురించి అతిగా ఆలోచిస్తూ జీవితానికి సంబంధించిన ఇతర విషయాల్లో సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం చాలామంది చేసే పొరపాటు. అన్నిటికంటే ముఖ్యంగా జీవిత భాగస్వామి తమపట్ల ప్రేమ, ఆప్యాయత చూపిస్తూ దగ్గరగా ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ అసంతృప్తిగా ఉన్న వక్షోజాల పరిమాణం వల్ల జీవితభాగస్వామి ఆసక్తి చూపించకపోవడం, దగ్గరకు తీసుకోకపోవడం, ఇతరులను చూపించి పోల్చడం, ఎగతాళి చేసి మాట్లాడటం వంటివి చేస్తుంటారు. వీటన్నిటివల్ల మహిళలు బయటకు చెప్పుకోలేని ఒత్తిడిని మోస్తూ ఉంటారు.
ఈ సమస్యను చాలావరకు పొష్టికారం తీసుకోవడం వల్ల అధిగమించవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాలు, పాలు, పండ్లు, కండరాల పెరుగుదలకు తోడ్పడే గుడ్లు, డ్రై ఫ్రూట్స్ మొదలైనవి ఆహారంలో భాగం చేసుకుంటే ఈ వక్షోజాల అసంతృప్తి నుండి బయటపడచ్చు. అంతేకాకుండా ఫిజిషియన్స్ సూచించే కొన్నిరకాల వ్యాయామాలు చెయ్యడం వల్ల పరిమాణాన్ని పెంచుకోవడం, జారినట్టుగా ఉండే వక్షోజాలను బిగుతుగా మార్చుకోవడం సాధ్యమవుతుంది.
Updated Date - 2023-07-31T10:36:50+05:30 IST