Health Tips: సొరకాయలతో కూరలు చేస్తే తినని వాళ్లు కూడా.. ఈ విషయం తెలిస్తే వాటిని యమా వాడేస్తారు..!
ABN, First Publish Date - 2023-10-10T13:32:50+05:30
ఇది పొట్ట ఆరోగ్యానికి కూడా మంచిది.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్తదారులు, కొత్త మార్గాలు వెతుక్కోవడం అనేది మామూలైపోయింది. ఏది మంచిదో దానిని కష్టపడి సాధించుకుని తినడానికి అలవాటు పడ్డాం. అయితే ఆరోగ్యాన్ని ఎప్పుడూ ఒకే విధంగా నిలిపేది నీరు. నీటితో శరీరానికి చాలా సంబంధం ఉంది. స్వచ్ఛతకు పేరుగాంచిని నీటితో మనిషి జీవితం ముడిపడి ఉంది. అయితే నీరులా కాకుండా నీటికి బదులు జూస్‌లు తీసుకుంటే అది దాహాన్ని తగ్గించడంతో పాటు శరీరం బరువును కూడా తగ్గిస్తుంది. చాలా మంది టీ, కాఫీ తాగడానికి పరుగెత్తుతారు. అయితే టీ, కాఫీలకు బదులు కాస్త హెల్తీ డ్రింక్ తీసుకోవడం మంచిది.
మన ఆరోగ్యానికి ఆధారం ఆహారం. ఆహారం ఎంత ముఖ్యమో. మన శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్, ఇతర పోషకాలన్నీ ఆహారం ద్వారా మనకు అందుతాయి. దీనికి మన డైట్‌లో ఉదయం నిద్రలేవడం నుంచి ఏం తింటున్నాం, తాగుతాం అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆహారం, పానీయం ఇది శరీరంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది.
ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీరు తాగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఉండవని సూచిస్తున్నారు. చాలా మంది నీళ్లు తాగిన వెంటనే టీ లేదా కాఫీ తాగడానికి పరుగెత్తుతారు. అయితే టీ, కాఫీలకు బదులు కాస్త హెల్తీ డ్రింక్ తీసుకోవడం మంచిది. అటువంటి ఆరోగ్యకరమైన పానీయం సొరకాయ రసం. చాలా మంది దాని గురించి ఎప్పుడూ వినలేదు. అయితే ఉదయాన్నే పరగడుపున సొరకాయ రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: 7 నెలల బాబుకు అదే పనిగా దగ్గు.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్తే.. ఎక్స్‌రే తీసి చూసిన డాక్టర్లకు షాక్.. ఊపిరితిత్తుల్లో..!
సొరకాయ రసం శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి శరీరాన్ని శుభ్రపరచడంలో బాగా సహాయపడుతుంది. ఇది పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా మంచిది.
శరీరంలో నీటిని నిలుపుకోవడం, బరువు తగ్గడం, జీర్ణ సమస్యలను దూరం చేయడం, చర్మాన్ని అందంగా మార్చడం, బిపి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలను సొరకాయ జ్యూస్ శరీరానికి అందిస్తుంది. అయితే సొరకాయ రసాన్ని ఉదయాన్నే ఫ్రెష్ గా తయారుచేసుకుని సేవించాలి. దీన్ని తయారుచేసిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచడం, తరువాత తినడం వల్ల ప్రయోజనాలు చాలా వరకు తగ్గుతాయి.
Updated Date - 2023-10-10T13:32:50+05:30 IST