Sweet Potato: చిలగడదుంపలు.. తియ్యగా ఉంటాయో లేదో చూడగానే చెప్పేయడం ఎలాగంటే..!
ABN, First Publish Date - 2023-11-21T17:11:01+05:30
దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అయితే చిలకడ దుంపతో అందే మరిన్ని ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
స్వీట్ పొటాటో అనేది ఏడాది పొడవునా వస్తూనే ఉంటుంది. అక్టోబర్, డిసెంబర్ మధ్య బాగా దొరుకుతుంది. చిలకడ దుంపలు రుచిగానే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా పోషకాలను అందిస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్ ఇందులో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అయితే చిలకడ దుంపతో అందే మరిన్ని ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
చలికాలంలో చిలకడదుంపలు ఇష్టంగా తింటూ ఉంటారు. చిలకడ దుంపల్లో పాడైపోయిన వాటిని ఏలా గుర్తించాలో చూద్దాం.
1. చిన్న పరిమాణంలో ఉన్న దుంపలు, తీసుకోవాలి.
2. గట్టిగా ఉండకూడదు. ముట్టుకుంటే బంగాళ దుంపలా ఉండాలి.
ఇది కూడా చదవండి: రాత్రి పడుకునేముందు వంటింట్లో కనిపించే వీటిని ముఖానికి రాసుకోండి చాలు.. మర్నాటికే..!
3. మృదువైన చిలకడ దుంపలను తీసుకుంటే అవి ఉడికించినా, కాల్చినా కూడా రుచిగా ఉంటాయి,
4. చిలకడ దుంపలను పాడైపోతే తేమలో నిండిన ప్రదేశంలో ఉంచితే అవి త్వరగా మొలకెత్తే అవకాశం ఉంది.
5. బంగాళదుంపల మాదిరిగా, చిలగడదుంపలను రిఫ్రిజిరేటర్ లో ఉంచకూడదు. కాంతిలో ఉంచడం వల్ల త్వరగా మొలకెత్తాయి.
6. దుంపలను ఉడికించడానికి, కాల్చడానికి ముందు కడగాలి.
7. ఎముకలు మరియు కళ్ల ఆరోగ్యానికి కూడా మంచిది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-21T17:11:03+05:30 IST