ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Belly Fat: బాన పొట్ట కరగాలంటే.. ప్రతి రోజూ ఈ 6 అంశాలను పాటించండి చాలు.. కసరత్తులు చేయకుండానే..!

ABN, First Publish Date - 2023-08-09T15:01:33+05:30

అలాగే అధిక బరువు పెరగడం అనేది ఆహారం వల్ల మాత్రమే అవుదు. దీనికి ఆహారంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తోడవుతాయి.

stomach

శరీరం ఒక్కసారే బరువు పెరగడం అనేది జరగదు. అలాగే అధిక బరువు పెరగడం అనేది ఆహారం వల్ల మాత్రమే అవుదు. దీనికి ఆహారంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తోడవుతాయి. అయితే కొన్ని చిట్కాలతో బరువును తగ్గించుకోవచ్చు. దీనికి ఎలాంటి కసరత్తులు చేయనవసరం లేదు. శరీర బరువు పెరగడం ఆందోళన కలిగించే అంశంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. దీనికోసం బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఆహారాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం కానీ, వ్యాయామశాలలో గంటల తరబడి చెమటలు పట్టాల్సిన అవసరం కానీ ఉండదు. పొట్ట తగ్గించుకోవడానికి కొన్ని చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టాలి అవేమిటంటే...

నడక ప్రారంభించండి.

నడవడం వల్ల చాలా సార్లు కొవ్వు తగ్గుతుంది. రోజూ నడవడం వల్ల శరీరం ఆకారంలోకి రావడం ప్రారంభమవుతుంది. క్రమేపి శరీరం బరువును కోల్పోతూ ఉంటుంది. నడక అనేది బయట, లేదా ఇంట్లో ఎక్కడ చేసినా కూడా ఆరోగ్యానికి ప్రయోజనాన్ని అందిస్తుంది.

గోరువెచ్చని నీరు తాగడం..

గోరువెచ్చని లేదా కాస్త వేడి నీటిని తాగడం వల్ల పొట్టపై ప్రభావం చూపుతుంది. కానీ, ఏ సమయంలో నీళ్లు తాగాలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఏదైనా తిన్న 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిని తాగితే దాని ప్రభావం పొట్టపై వేగంగా కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: పకోడీ ప్రియులు తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది.. ముట్టుకుంటే నూనె అంటుతోందా..? అయితే..!


ఫైబర్ తినండి.

ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తీసుకోవడం అనేది రోజులో ఎక్కువ సమయం ఆకలి లేకుండా చేస్తుంది. కడుపుని నిండుగా ఉంచుతుంది. ఆకలి ఎప్పుడైతే మందగిస్తుందో, వేరే ఆహారాలను తీసుకునే అవకాశం తగ్గుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

రోజుకు ఒక పండు తినండి.

కనీసం రోజులో ఒక్కసారైనా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ తినడానికి ప్రయత్నించాలి. యాపిల్, జామ, పియర్ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లు ఫైబర్ మంచి మూలం. పండ్లను ఉదయం 11 గంటల ప్రాంతంలో, సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్య తినవచ్చు.

ఆహారంలో ప్రోటీన్ చేర్చండి

కొవ్వును తగ్గించడంలో ప్రోటీన్ ప్రభావవంతంగా ఉంటుంది. దీని వల్ల శరీరానికి కూడా ఎంతో శక్తి అందడంతో పాటు కండరాలకు కూడా బలం చేకూరుతుంది. ఇందుకోసం గుడ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో తీసుకోవాలి.

తగినంత నిద్ర కావాలి.

తరచుగా ఒక వ్యక్తి బరువు తగ్గడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పటికీ బరువు తగ్గదు. దీనికి కారణం నిద్ర లేకపోవడం కావచ్చు. నిద్ర పూర్తి అయితే ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడం ప్రారంభమవుతుంది.

Updated Date - 2023-08-09T15:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising