Fennel seeds: కంటి చూపును మెరుగుపరిచే సోంపు ప్రతిరోజూ తీసుకుంటే కలిగే మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు ఇవే...!!
ABN, Publish Date - Dec 31 , 2023 | 01:20 PM
ఈ పోషకాలు చాలా ముఖ్యమైనవి. ఇవి కంటి వ్యాధులను తగ్గించేందుకు సహకరిస్తాయి. పొటాషియం ఒత్తిడిని నియంత్రించడంలోను, గ్లాకోమా వంటి పరిస్థితిని నివారించడంలోనూ సహకరిస్తుంది.
సోంపు లేదా సోపు సువాసనకు మారుపేరుగా భారతీయ వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇవి ఎన్నో రకాలుగా ఆరోగ్యప్రయోజనాలను అందిస్తాయి.సోంపును చాలామంది ఇష్టంగా తింటారు. దీన్ని ఎక్కువగా మౌత్ ఫ్రెషనర్‌గా కూడా వాడతారు. సోంపును కూరల్లో, స్వీట్స్‌లో కూడా వేస్తారు. సోంపులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిని రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. సోపు గింజలను ఎక్కువగా తీసుకుంటే కంటి చూపు మెరుగుపెడుతుంది. ఫెన్నెల్ గింజలు, సోంపు గింజలలో విటమిన్ సి, కంటి శుక్లం, ఒంటిమీద వచ్చే మచ్చలను తగ్గించడంలోనూ కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది.
సోపుతో కంటి ఆరోగ్యం..
విటమిన్ సి, ఐరెన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలున్న సోంపు మొత్తం కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పోషకాలు చాలా ముఖ్యమైనవి. ఇవి కంటి వ్యాధులను తగ్గించేందుకు సహకరిస్తాయి. పొటాషియం ఒత్తిడిని నియంత్రించడంలోను, గ్లాకోమా వంటి పరిస్థితిని నివారించడంలోనూ సహకరిస్తుంది.
సోంపుల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు..
కళ్లు వాపు రావడం, కళ్లు పొడిబారినట్టు ఉండటం వంటివి దృష్టి సమస్యలవైపు దారితీస్తాయి. వీటికి సోంపు చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి: బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్‌లానే ఎకాయ్ బెర్రీస్ కూడా మెదడు ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్.. వీటిని తీసుకుంటే..!!
సోంపు గింజలు
1. సోంపు గింజలను నీటిలో నానబెట్టి.. ఆ నీటిని తాగడం వల్ల కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. ఒక స్పూన్ సోంపు గింజలను తీసుకుని.. వాటిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని ఉదయాన్నే తాగాలి. ఇలా చేస్తే శరీరానికి విటమిన్లు, మినరల్స్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అంతే కాకుండా. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ వాటర్ ఉదయం, సాయంత్రం తాగినా శరీరంలో కొవ్వు ఈజీగా కరుగుతుంది.
2. వయస్సుతో వచ్చే మచ్చలను తగ్గించడంలో సోంపు సహకరిస్తుంది. సోంపు గింజలు, వాటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో, మాక్యులాలోని కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, AMD పురోగతిని నిరోధించడంలో సహాయపడతాయి. అవి కెరోటినాయిడ్స్ గొప్ప మూలం, ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి AMD ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)
Updated Date - Dec 31 , 2023 | 01:23 PM