ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Deepavali 2023: దీపావళికి బాంబులు పేల్చుతూ.. పొరపాటున చేతులు, కాళ్లపై గాయాలయ్యాయా..? వెంటనే తగ్గేందుకు ఏం చేయాలంటే..!

ABN, First Publish Date - 2023-11-13T12:14:52+05:30

తాజా కలబంద జెల్ కాలిన ప్రదేశంలో పూయడం వల్ల ఉపశమనం ఉంటుంది.

home remedies

దీపావళి పండుగంటేనే పిల్లల పండుగ. ఆ రోజున పిల్లలు చేసే హాఢావుడి, సందడి అంతా ఇంతాకాదు. అయితే సాయంత్రం దీపాలవేళ పటాసులు కాల్చుతూ ఆ మెరుపుల్లో నవ్వులతో కేరింతలు కొట్టేంతవరకూ బాగానే ఉంటుంది. కానీ చిన్న నిర్లష్యం చేసినా కాళ్ళూ చేతులు కాల్చుకుని బాధపడుతుంటారు. లేత చర్మాలేమో.. ఇట్టే వేడి తగిలి ఓడిలిపోతాయి. దీనితో పాటు కాలిన గాయం, మంట కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాళ్ళకి చేతులకి గాయాలయినప్పుడు ఏంచేస్తాం. ఇంట్లో వెంటనే పసుపు, నూనె పెట్టి కాసేపటికి మంట తగ్గుతుంది. ఇవే కాకుండా ఇంటి నివారణలు ఇంకా ఉన్నాయి.. అవి..

బంగాళాదుంప: చిన్నగా కాలిన గాయాలపై తక్షణ ఉపశమనం కోసం పచ్చి బంగాళాదుంప ముక్కను సున్నితంగా రుద్దండి. బంగాళాదుంప రసాన్ని రాయండి. పచ్చి బంగాళాదుంపలు గాయం మీద వెంటనే రాస్తే పెద్దగా మంట రాకుండా చేస్తుంది. బంగాళ దుంప రాయడం వల్ల గాయం త్వరగా మానే అవకాశం ఉంటుంది.

కోల్డ్ వాటర్ లేదా కోల్డ్ మిల్క్: ఇంట్లో పటాకుల కాలిన గాయాలకు చికిత్స చేయడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతులలో ఒకటి. ఇది తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. నొప్పిని తగ్గించడానికి చాలామంది కాలిన గాయాలకు వెంటనే ఐస్ క్యూబ్‌లను ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి రక్త ప్రవాహాన్ని నిరోధించి, సున్నితమైన కణజాలాలకు హాని కలిగిస్తాయి.

అలోవెరా: బొబ్బలు ఏర్పడే అవకాశాలను తగ్గించడానికి కలబంద చక్కని పరిష్కారం. తాజా కలబంద జెల్ కాలిన ప్రదేశంలో పూయడం వల్ల ఉపశమనం ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఏ ఆస్పత్రిలో చూసినా అన్నీ ఆపరేషన్లే.. అసలు ఏం చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందంటే..!


పసుపు: పసుపు పేస్ట్, గోరువెచ్చని పాల మిశ్రమాన్ని రాత్రంతా కాలిన గాయాలకు అప్లై చేయడం వ్లల పసుపులో కర్కుమినాయిడ్స్, యాంటీక్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన బయోయాక్టివ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇవి గాయానికి ఉపశమనాన్ని అందించి, వాపును తగ్గిస్తాయి.

కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో విటమిన్ E, లారిక్ యాసిడ్, మిరిస్టిక్ యాసిడ్, క్యాప్రిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ కొబ్బరి నూనె కాలిన గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.

Updated Date - 2023-11-13T12:14:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising