Milk with Ghee: పాలల్లో నెయ్యి కలుపుకుని తాగడమేంటి..? ఇదేం టేస్ట్ అని అవాక్కవుతున్నారా..? లాభమేంటో తెలిస్తే..!
ABN, First Publish Date - 2023-08-25T15:25:48+05:30
నెయ్యి కడుపు ఆమ్లాల స్రావాన్ని ప్రేరేపించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది.
లిక్విడ్ గోల్డ్ అని పిలిచే నెయ్యి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్ ఎ, డి, ఇ, కె ఉన్నాయి. నెయ్యిలోని లక్షణాలు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులకి కూడా మంచి మూలం. అయితే నెయ్యని ఒక్క ఆహారపదార్ధాలలో మాత్రమే కలిపి తీసుకోవడం కాకుండా, పానీయాలలోనూ కలిపి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేదం చెబుతుంది. గోరువెచ్చని పాలలో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల పాల శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు అనేక ఇతర అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. అవేమిటంటే..
పాలలో నెయ్యి కలపడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు:
1. పోషకాల శోషణ: నెయ్యి పాలలో ఉండే కొవ్వులో కరిగే విటమిన్ల (A, D, E , K) Absorptionలో సహాయపడుతుంది, శరీరానికి వాటి అవసరాన్ని పెంచుతుంది.
2. ఆరోగ్యకరమైన కొవ్వులు: నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి శరీరానికి నిరంతర శక్తిని అందిస్తాయి.
3. ఎముకల ఆరోగ్యం: నెయ్యి, పాలు కలయిక కాల్షియం, విటమిన్ డి అందిస్తుంది, ఎముక ఆరోగ్యానికి సహకరిస్తుంది. నెయ్యి కీళ్లకు సహజమైన లూబ్రికెంట్ Lubricant గా పనిచేస్తుంది, కీళ్ల సమస్యలను తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్కడ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫ్రీ.. సంతానలేమితో బాధపడేవాళ్లకు గుడ్ న్యూస్..!
4. జీర్ణ సహాయం: నెయ్యి కడుపు ఆమ్లాల స్రావాన్ని ప్రేరేపించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
5. జీవక్రియను పెంచుతుంది: నెయ్యితో పాలు తాగడం వల్ల మెటబాలిజంను పెంచడానికి, మెరుగైన బరువు తగ్గడానికి సపోర్ట్ చేస్తుంది.
6. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది: పడుకునే ముందు వెచ్చని పాలు బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి. పాలలో కొంత నెయ్యి కలపడం వల్ల దాని పోషక విలువలు మెరుగ్గా పెరుగుతాయి. నిద్రపోవడానికి సహాయపడుతుంది.
Updated Date - 2023-08-25T15:25:48+05:30 IST