ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

China: చైనాలో అసలేం జరుగుతోంది..? రంగంలోకి దిగిన డబ్ల్యూహెచ్‌వో.. పిల్లల్లో వింత నిమోనియాకు కారణమేంటి..?

ABN, First Publish Date - 2023-11-25T14:11:09+05:30

నవంబర్ 22న WHO ఒక ప్రకటన విడుదల చేసింది. పిల్లలో వ్యాప్తి చెందుతున్న న్యుమోనియా సమాచారాన్ని తెలిపింది.

Northern China

చైనాలో ఒక రహస్యమైన న్యుమోనియా వ్యాధి వ్యాప్తి చెందింది. దీనితో దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నెల నేషనల్ హెల్త్ కమిషన్ నుంచి చైనా ఆరోగ్య అధికారులు దేశంలో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులను గురించి సమాచారం ఉచ్చింది. పెరుగుతున్న న్యుమోనియా కేసుల గురించి డేటాను పంచుకోవాలని చైనాను కోరింది. అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే చర్యలు తీసుకోవాలని WHO దేశాన్ని కోరింది.

ఈ అనారోగ్యం వ్యాపించడం గురించి..

1. మొత్తం మీద పాఠశాలల్లో, విద్యాసంస్థల్లో వ్యాప్తి చెందుతున్న రహస్యమైన న్యుమోనియా వ్యాప్తి చెంది పిల్లలను ప్రభావితం చేస్తోందని తేలింది.

2. హాస్పటల్స్‌లో కేసుల పెరుగుదల కూడా గణనీయంగా పెరిగింది.

3. బాధిత పిల్లలు ఊపిరితిత్తుల వాపు, అధిక జ్వరం వంటి లక్షణాలను కలిగి ఉన్నారు.

4. పబ్లిక్ డిసీజ్ సర్వైలెన్స్ సిస్టమ్, మంగళవారం ఉత్తర చైనాలోని పిల్లల్లో గుర్తించిన న్యుమోనియా క్లస్టర్‌ల ఉనికిని ఫ్లాగ్ చేసింది.

ఇది కూడా చదవండి: దగ్గు, జలుబు అటాక్ చేశాయా..? ఈ 7 వంటింటి చిట్కాలతో బిగ్ రిలీఫ్ ఖాయం..!

WHO ఏమందంటే..

1. నవంబర్ 22న WHOఒక ప్రకటన విడుదల చేసింది. పిల్లలో వ్యాప్తి చెందుతున్న న్యుమోనియా సమాచారాన్ని తెలిపింది.

2. Who ప్రకారం కోవిడ్ -19 ఆంక్షలను ఎత్తివేయడమే ఈ వ్యాధి వ్యాప్తికి కారణమని చైనా అధికారులు తెలిపారు.

3. ఇన్ఫ్లుఎంజా, మైకోప్లాస్మా న్యుమోనియా, శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ వ్యాధికారక ప్రసరణకు కారణంగా తేలింది.


శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి...

1. సకాలంలో టీకాలు వేయడం.

2. అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉంచాలి.

3. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉడటమే మంచిది.

4. సమయానికి అవరసమైన పరీక్షలు చేయించాలి.

5. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించాలి.

6. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి.

ఇలాంటి మహమ్మారిని తరిమివేయాలంటే చైనా ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మరిన్ని చర్యలను అమలు చేయడం చాలా ముఖ్యం.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-25T14:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising