Pig Heart: రెండోసారి అదే ఆపరేషన్ రిపీట్.. ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు పంది గుండెను మార్చేసిన డాక్టర్లు..!
ABN, First Publish Date - 2023-09-25T12:22:15+05:30
గత సంవత్సరం, USలో కేవలం 4,100 కంటే ఎక్కువ గుండె మార్పిడిలు జరిగాయి, ఇది రికార్డు సంఖ్యలో ఉంది, అయితే సరఫరా చాలా తక్కువగా ఉంది
మానవ శరీరంలో ఏ అవయవానికి చిన్న మార్పు చేయాల్సివచ్చినా, దానిలో చిన్నలోపం వచ్చినా కూడా వైద్యులు సరిచేస్తారు. కానీ శరీరంలో అతిముఖ్యమైన గుండెకు ఏదైనా శస్త్రచికిత్స చేయడం అంటే కాస్త శ్రద్ధతో పాటు కాసింత అదృష్టం కూడా కలిసిరావాల్సి వస్తుంది. అయితే ఈ వ్యక్తికి అదృష్టం అలా ఇలా కాదు. అందర్మీ ఆశ్చర్యపరిచేలా వచ్చింది.
అమెరికా వైద్యులు ఒక వ్యక్తికి పంది గుండెను అమర్చారు. దీనితో అతని ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నం చేసారు. ఇది రెండోసారి. రెండు రోజుల్లోనే లేచి కూర్చున్నాడు. ఇది యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడిసిన్ వైద్యులు సాధించిన అద్భుతం.
వైద్యులు అందించిన సమాచారం ప్రకారం, లారెన్స్ ఫౌసెట్, 58 ఏళ్ల నేవీ ఉద్యోగి, అతడు కొంత కాలంగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నాడు, అయితే ఇతర ఆరోగ్య సమస్యలతో అతనికి మరో గుండెను అమర్చలేని స్థితి ఏర్పండింది.
రోజులు గడిచేకొద్దీ లారెన్స్ ఫౌసెట్ విషయంలో పరిస్థితి మరీ క్లిష్టం అయిపోయింది. అతనికి మనిషి గుండెకాయ కన్నా పంది గుండెను అమర్చడం సరైనదని నిర్ణయించారు వైద్యులు. ఈ శస్త్ర చికిత్స నుంచి ఫౌసెట్ కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని చెప్పారు వైద్యులు. గతంలోనూ రెండు నెలలకు మించి జీవించడనుకున్న డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి జన్యుపరంగా మార్పు చెందిన పంది గుండెను ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మార్పిడి చేసి విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: జీలకర్రను నీళ్లల్లో వేసిన 5 నిమిషాలకే నీళ్ల రంగు మారిపోయిందా..? దాని అర్థమేంటంటే..!
ప్రపంచవ్యాప్తంగా, మార్పిడి కోసం దానం చేయవలసిన మానవ అవయవాలకు భారీ కొరత ఉంది. గత సంవత్సరం, USలో కేవలం 4,100 కంటే ఎక్కువ గుండె మార్పిడిలు జరిగాయి, ఇది రికార్డు సంఖ్యలో ఉంది, అయితే సరఫరా చాలా తక్కువగా ఉంది, దీర్ఘకాల మనుగడకు అవకాశం ఉన్న రోగులకు మాత్రమే ఈ సాయం అందిస్తున్నారు.
అంతకుముందు, మానవుల రోగనిరోధక వ్యవస్థ ద్వారా విదేశీ కణజాలం నాశనమైనందున జంతువుల నుండి మానవునికి అవయవ మార్పిడిలో పరీక్షలు చాలా సంవత్సరాలు విఫలమయ్యాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు జన్యుపరంగా మార్పు చెందిన పందుల అవయవాలను మానవీయంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల, పందుల మూత్రపిండాలు, గుండె మానవ శరీరాలకు అమర్చబడ్డాయి.
Updated Date - 2023-09-25T12:22:15+05:30 IST