ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Child Health: ఈ విషయం తెలిస్తే పిల్లల చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే లాగేసుకుంటారు..!

ABN, First Publish Date - 2023-02-18T12:33:23+05:30

ప్రతి దానికి పిల్లలకు ఫోన్ చేతిలో పెట్టేసే తల్లిదండ్రులు కోకొల్లలు.

Kids Heart
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకప్పుడు అమ్మలు, పిల్లలు అన్నంతినడం లేదని వాళ్ళని చంకనేసుకుని వీధులు తిప్పుతూ, అవి చూపించి, ఇవి చూపించి గారం చేసి అన్నం పెట్టేవారు. ఇదంతా ఒకప్పటి మాట. మరిప్పుడో పిల్లల గోల భరించలేకో, లేదా పెద్దాళ్ల పని కావడంలేదనో అలసిపోయో, అన్నం తినిపించడానికో ఇలా ప్రతి దానికి పిల్లలకు ఫోన్ చేతిలో పెట్టేసే తల్లిదండ్రులు కోకొల్లలు. ఇప్పటి పిల్లలకు ఫోన్ లేనిదే ముద్ద దిగదు. 'ఇదేం చోద్యం మారోజుల్లో ఇలా కాదమ్మా' అనేవారూ ఉన్నారు. కాకపోతే ఇప్పటి రోజులు ఇలానే పిల్లల చేతిలో ఫోన్లతోనే, వీడియో గేములు, యానిమేషన్ పాటలతోనే గడుస్తున్నాయి. ఇదేం పెద్ద మార్పుకాదు. ఇదో తెలియని, పొంచి ఉన్న ప్రమాదమని తెలుసుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. అసలు పిల్లలకు ఫోన్ ఇస్తే వచ్చే ప్రమాదం ఏంటట అంటే...

ఫోన్ పట్టుకుని మాత్రమే అన్నం తినే పిల్లల్లోనూ, వీడియో గేమ్స్ ఆడేవారిలో జరిగిన పరిశోధనల ప్రకారం వీళ్లల్లో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా పెరుగుతున్నాయట. ప్రాణాంతక కార్డియాక్ అరిథ్మియాలను కలిగి, హార్డ్ రిథమ్‌లో కూడా మార్పు సంభవిస్తుంది. అలాగే సార్ట్ ఫోన్‌కి విపరీతంగా అలవాటు పడిన పిల్లలు స్పృహ కోల్పోయిన సంఘటనలను కూడా ఈ పరిశోధన బయటపెట్టింది.

ఇదే హృదయ సంబంధ వ్యాధులతో పుట్టుకతోనే ప్రమాదంలో ఉన్న పిల్లలు అయితే ప్రాణాంతకం కావచ్చు.

కార్డియాక్ అరిథ్మియాకు ఏది దారితీస్తుంది?

పరిశోధకులు దీనిమీద సమీక్షను నిర్వహించారు. వీడియో గేమ్‌లు ఆడుతున్నప్పుడు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయే పిల్లల కేసులను గుర్తించినపుడు 22 కేసులలో, కొంతమంది పిల్లలు గుండెపోటుతో మరణించారని తేలింది.

వీడియో గేమ్‌లు పిల్లలకు సురక్షితమైన ప్రత్యామ్నాయం కాదు.

ఎక్కువ సమయం గేమింగ్‌ ప్లాట్‌ఫాంలలో గడపడం వల్ల పిల్లలు భావోద్వేగపరమైన సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలను గేమింగ్ డిజార్డర్స్ అంటున్నారు. గేమింగ్ సవాళ్లను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్ డిజార్డర్ తీవ్రమైన సమస్యగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో తెలిపింది. గేమింగ్ అలవాట్లు పిల్లల్లో ఎపిలెప్సీ (epilepsy) అనే మెదడు సంబంధ అనారోగ్యానికి కారణమవుతోంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరించింది.

దీనికి ప్రత్యామ్నాయం ఏమిటంటే..

పిల్లల్లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్, వీడియో గేమింగ్ అలవాటును పెద్దలు మార్పించగలిగితే చాలా వరకూ వారిని కాపాడుకున్నట్టే.. అయితే ఇది ఒక్కరోజులో జరిగే తంతుకాదు. నెమ్మదిగా వారిని ఎంగేజ్ చేయాలి. ఇదంతా జరగాలంటే ముందు ఫోన్ వాడకాన్ని పెద్దలే తగ్గిస్తే మంచిది. కాస్త పెద్ద పిల్లల్ని ఆటల్లో బిజీగా ఉంచాలి. శరీరాన్ని శ్రమపెట్టి ఆడే ఆటలలో వారికి తర్ఫీదు ఇవ్వడం వల్ల పిల్లల జ్ఞాపకశక్తితో పాటు శారీరకంగా కూడా దృఢంగా మారతారు. చదువుల్లో కూడా చురుగ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది

Updated Date - 2023-02-18T12:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising