ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ.. వానాకాలంలో వాడితే రిస్కే.. అసలు కారణమేంటంటే..!

ABN, First Publish Date - 2023-07-03T11:56:49+05:30

ఇంట్లో వండిన భోజనం తీసుకోవడం వల్ల ఆహారం కలుషితమయ్యే అవకాశాన్ని తొలగిస్తుంది.

monsoon season
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవి నుండి ఉపశమనం వానలు తీసుకురావచ్చుకానీ.. సరైన ఆహారం తీసుకోకపోతే ఈ తేమ వాతావరణంలో అంటువ్యాధులు వచ్చేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్ మనల్ని వ్యాధులు, బాక్టీరియా బారినపడేలా చేస్తాయి, దీనితో మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో ఆరోగ్యకరమైన, సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో పుట్టగొడుగులు ఆహారంలో తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే..

వర్షాకాలంలో పుట్టగొడుగులను ఎందుకు తినకూడదు?

వర్షాకాలంలో ఆరోగ్యంగా, ఉండాలంటే పౌష్టికాహారం తప్పక తీసుకోవాలి. ఇంటి పరిసరాల పరిశుభ్రత పాటించాలి. వీటితోపాటు కొన్ని తినకూడని ఆహారాలు కూడా ఉన్నాయి. పుట్టగొడుగులు అనేక వంటలలో ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో వండే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. కానీ వర్షాకాలంలో మాత్రం పుట్టగొడుగులు తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే అవి చాలా తడిగా ఉన్న నేలలో పెరుగుతాయి. అలాగే దానిపై చాలా బ్యాక్టీరియా ఉంటుంది. దీని కారణంగా ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.

ముఖ్యంగా వర్షాకాలంలో, పుట్టగొడుగులు చాలా బీజాంశాలను ఉత్పత్తి చేస్తాయి. వీటి చూట్టూ చాలా మొలకలు పుట్టుకు వస్తాయి. వర్షాకాలంలో ఎక్కువ పునరుత్పత్తి చేయగలవు. అయితే, ఇంత హానికరం అంటున్న పుట్టగొడుగుల్లో చాలా పోషకాలు కూడా ఉన్నాయి. పుట్టగొడుగుల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మర్చిపోవద్దు.

ఇది కూడా చదవండి: ఇది తెలియక ఎంత ఉల్లిపాయ పొట్టును చెత్తబుట్టలో పారేసి ఉంటారో.. ఈ సంగతి ముందే తెలిసి ఉంటే బంగారంలాగా..!

ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

వర్షాకాలంలో పుట్టగొడుగుల వినియోగాన్ని పరిమితం చేయవలసిన అవసరాన్ని పక్కన పెడితే, పుట్టగొడుగులు మంచి ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్ కలిగి ఉన్న అద్భుతమైన పోషక విలువలతో కూడిన కూరగాయ. ఇందులో విటమిన్ బి ఉంది, ఇది పోషకాహారానికి మంచి మూలం, విటమిన్ B మన రోగనిరోధక వ్యవస్థలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే బాహ్య అంటువ్యాధులు, జెర్మ్స్‌తో పోరాడడంలో సహాయపడుతుంది.

వర్షాకాలంలో నివారించాల్సిన ఇతర ఆహార పదార్థాలు

1. రోడ్డు పక్కన ఉన్న ఆహారం, జ్యూస్‌లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే, కలుషితమైన నీటిని తీసుకోవడం వల్ల అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

2. నూనెతో చేసిన డీప్ ఫ్రైలు, వర్షాకాలంలో తీసుకోకపోవడం మంచిది కాదు.

3. ఇంట్లో వండిన భోజనం తీసుకోవడం వల్ల ఆహారం కలుషితమయ్యే అవకాశాన్ని తొలగిస్తుంది.

4. తినడానికి ముందు పండ్లు, కూరగాయలను బాగా కడగాలి.

Updated Date - 2023-07-03T11:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising