ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fish: చేపలతో కలిపి పొరపాటున కూడా తినకూడని 6 ఆహార పదార్థాల లిస్ట్ ఇదీ.. తింటే ఏమౌతుందంటే..!

ABN, First Publish Date - 2023-11-28T11:46:19+05:30

శరీరంలో వీటిని మంచి మొత్తంలో తీసుకుంటే మెదడు మెరుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది. శరీర ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ముందుంటుంది.

health and immunity

నాన్ వెజ్ తినడం అంటే ముఖ్యంగా ఎంచుకునే వాటిలో చికెన్, మాంసం మాత్రమే ఉంటాయి. చేపలను చాలా దూరంలో ఉంచుతారు ఇప్పటి వారు. అయితే చేపల్లోని పోషకాలు శరీరానికి చాలా అవసరం. ఇందులోని లీన్ ప్రోటీన్, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో వీటిని మంచి మొత్తంలో తీసుకుంటే మెదడు మెరుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది. శరీర ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ముందుంటుంది. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసినా కొన్ని ఆహారపదార్థాలను చేపలతో కలిపి తినడం వల్ల ప్రతికూల ప్రభావాలను దానితో పాటు జీర్ణకోశ వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ పదార్ధాలు ఏవంటే..

పాలు, పాల పదార్థాలు..

చేపలతో పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఉబ్బరం, కడుపు నొప్పి, చర్మ వ్యాధులు, అలర్జీలు కూడా వస్తాయి. డైరీ, చేపలను కలిపి తీసుకుంటే అధిక ప్రోటీన్ కంటెంట్, జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.

ఆమ్ల ఫలాలు

చేపలు, సిట్రస్ పండ్లను కూడా కలిపి తినడం ప్రమాదకరం. సిట్రస్ పండ్లలో నారింజ, బత్తాయి, నిమ్మ ఇలాంటి వాటిలో యాసిడ్ ఉంటుంది. ఇది చేపలలోని ప్రోటీన్‌లతో చర్య తీసుకుంటుంది.

ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలు

చేపలను అధికంగా ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలతో కలపడం వల్ల చేపలలోని నాణ్యత, పోషణ తగ్గుతుంది. వేయించిన ఆహారాలలో అధిక స్థాయిలో ఉండే ట్రాన్స్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి హానికరం.

బీన్స్, చిక్కుళ్ళు

బీన్స్, చిక్కుళ్ళు గ్యాస్ కలిగిస్తాయి. బీన్స్‌లో అధిక మొత్తంలో రాఫినోస్ అనే కాంప్లెక్స్ చక్కెర ఉంటుంది, బీన్స్‌లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. దీనితో చేపలు కలిపి తీసుకుంటే వాతం కలిగే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి: రోజూ అసలు పొద్దున్నే అసలు ఎందుకు నిద్ర లేవాలి..? ఆలస్యంగా లేవడం వల్ల 10 లాభాలు మిస్..!


పిండి పదార్ధాలు

బంగాళాదుంపలు వంటి పిండి పదార్ధాలతో చేపలను కలపి తీసుకోవడం వల్ల శరీరానికి అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్లను అందజేస్తుంది. జీర్ణవ్యవస్థ మందగిస్తుంది.

స్పైసి ఫుడ్

స్పైసీ ఫుడ్‌తో చేపలను తిన్నప్పుడు, చేపల తేలికపాటి రుచి కొంతవరకు తగ్గుతుంది. చేపలతో పాటు చాలా స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణకోశ అసౌకర్యం, ఉబ్బరం కలుగుతుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-28T11:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising