Weight Loss: 7 రోజుల్లోనే బరువు తగ్గడం ఖాయం.. ఈ జ్యూస్‌ను రోజూ రాత్రి కానీ.. పొద్దున్నే పరగడుపున కానీ తాగితే..!
ABN, First Publish Date - 2023-11-21T14:53:14+05:30
రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన నీటిని తాగడం వల్ల బరువు తగ్గడం ఖాయమట.
బరువుతగ్గాడానికి ఇప్పటిరోజుల్లో ఎన్నో అవకాశాలున్నా కూడా చాలామంది అధిక ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే బరువుతగ్గడం అనేది అంత సులువుగా జరిగే ప్రక్రియకాదు. దీనికి ఎంత సమయం తీసుకుంటే అంతమంచిది. ఎక్కువ సమయంలో తక్కువగా బరువు తగ్గడమే ఆరోగ్యానికి మంచిది అంటారు. అయితే ఇప్పటి రోజుల్లో చాలామంది.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గి చూపిస్తున్నారు. ఇది ఎంత వరకూ ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి యాపిల్ సైడర్ వెనిగర్: స్థూలకాయంతో బాధపడేవారిలో చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులే కారణం కావచ్చు. ఫాస్ట్ పుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం అనేది కూడా బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. బరువు తగ్గాడానికి యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
బరువు తగ్గాలంటే..
తక్కువ సమయంలో త్వరగా బరువు తగ్గాలంటే, రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన నీటిని తాగడం వల్ల బరువు తగ్గడం ఖాయమట. అయితే దీనిని నేరుగా కాకుండా నీటిలో కలిపి తీసుకోవాలట.. లేదంటే ఇది గొంతుకు, కడుపుకు హాని చేస్తుందట. ఈ పానీయాన్ని ఉదయాన్నే పరగడుపున, లేదా రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవాలట.
ఇది కూడా చదవండి: ఖర్జూర పండ్లను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కడిగేసి తినేస్తున్నారా..? ఈ ఒక్క నిజం కనుక తెలిస్తే..!
యాపిల్ సైడర్ వెనిగర్ ప్రయోజనాలు..
యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎసిటిక్ యాసిడ్ గుండెకు చాలా మేలు చేస్తుంది. చర్మ సంరక్షణలో కూడా సహాయపడుతుంది. దీనిలోని విటమిన్ B1,B2, B6 బయోటిన్, ఫోలిక్ ఆమ్లం, నియాసిన్, పాంతోతేనిక్ యాసిడ్, ఐరెన్, మెగ్నీషియం, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు తక్కువగా ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి. అంతే కాదు శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహకరిస్తాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-21T14:53:16+05:30 IST