3 Ayurvedic Herbs : ఈ మూలికలతో మగవారిలో ఎంత సత్తువ వస్తుందంటే..!! ట్రై చేసి చూడండి..
ABN, Publish Date - Dec 15 , 2023 | 12:30 PM
మధుమేహం, ఆస్టియో ఆర్థరైటిస్, కండరాల బలహీనత వంటి పరిస్థితులకు సమర్థవంతంగా చికిత్స చేయడం, బలం, ఎముక సాంద్రతను పెంచడం వంటివి చేస్తుంది.
ఆయుర్వేదం తరతరాల నుంచి వస్తున్న భారతీయ వైద్య విధానం. శరీరంలో శక్తి తక్కువగా ఉన్నవారు. శక్తిని పొందాలంటే ఆయుర్వేదంలో దీనికి చక్కని మూలికలున్నాయి. వీటితో జీవిశక్తి మెరుగుపరచడమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్నే మెరుగుపరచవచ్చు.
శిలాజిత్..
శిలాజిత్ అనేది ఖనీజాలతో నిండిన సేంద్రీయ ఉత్తత్తి, ఇది శరీరంలో శక్తిని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. శక్తిని పెంచడానికి దీనిని ఆయుర్వేదంలో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. పురుషులలో శక్తిని పెంచేందుకు శిలాజిత్ మెరుగ్గా పనిచేస్తుంది. సంతానలేమి సమస్య, స్పెర్మ్ కౌంట్ పెరుగుదలకు సహకరిస్తుంది.
సఫేద్ ముస్లి
సఫేద్ ముస్లి అనేది అనేక ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం చూపే ప్రసిద్ధి చెందిన ఆయుర్వేద మూలిక. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, కండరాలను పొందలనుకునే పురుషులకు ఇది చాలా ముఖ్యమైనది. మధుమేహం, ఆస్టియో ఆర్థరైటిస్, కండరాల బలహీనత వంటి పరిస్థితులకు సమర్థవంతంగా చికిత్స చేయడం, బలం, ఎముక సాంద్రతను పెంచడం వంటివి చేస్తుంది. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ ను ఉత్తేజపరిచే సహజ మూలిక, ఇది శక్తి స్థాయిలను పెంచుతుంది.
ఇది కూడా చదవండి: ఉసిరితో జుట్టుకే కాదు.. చర్మ సౌందర్యానికీ మేలే.. ఉదయాన్నే గ్లాస్ రసం చాలు..!!
అకర్కర
ఆయుర్వేదంలో అకర్కర అనేది పురుషుల ఆరోగ్యానికి మెరుగుపరిచేందుకు ప్రసిద్ధి చెందినది. ఈ హెర్బ్ బలహీనత, అలసటను తగ్గిస్తుంది. ఆందోళన స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తుంది. అడ్రినల్ గ్రంధులను మెరుగుపరుస్తుంది. టెస్టోస్టెరాన్ ఏర్పడటానికి సహకరిస్తుంది.
వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఈ ఆయుర్వేద మూలికలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మొత్తం శ్రేయస్సును మార్చడంలో సహాయపడుతుంది. శరీరంలోని శక్తిని ప్రోత్సహిస్తాయి. ఈ మూలికలు ముఖ్యంగా అడాస్టోజెన్, సమర్దవంతంగా కామోద్దీపన అని పిలుస్తారు. ఇవి మొత్తం పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 15 , 2023 | 12:31 PM