Cumin Seeds: జీలకర్రను నీళ్లల్లో వేసిన 5 నిమిషాలకే నీళ్ల రంగు మారిపోయిందా..? దాని అర్థమేంటంటే..!
ABN, First Publish Date - 2023-09-25T10:43:28+05:30
చాలామందిలో కనిపించే నిద్ర పట్టకపోవడం, నిద్రలేమి సమస్యకు జీలకర్ర మంచి ఔషదంగా పనిచేస్తుంది.
ఇప్పటి రోజుల్లో ప్రతి వస్తువు విషయంలోనూ కల్తీని చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని తెలియకుండా తినేస్తాం. మరికొన్ని వస్తువులలో కల్తీని కొన్ని చిట్కాలతో ఇట్టే కనిపెట్టేయచ్చు. లేదంటే ఈ కల్తీ పదార్థాలు పొట్టలోపలికి వెళ్ళి చాలా అనారోగ్యాలకు దారితీస్తాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మాత్రం చిన్న చిన్న చిట్కాలు తప్పనిసరి. జీలకర్ర జీర్ణ శక్తికి సపోర్ట్ చేస్తుంది. అలాగే మన భారతీయ వంటకాల్లో జీలకర్రకు ప్రత్యేకమైన స్థానం ఉంది. జీలకర్ర తినాలంటే ఆలోచించకుండా నోట్లో వేసేసుకుంటూ ఉంటాం అయితే అన్ని కల్తీలతో పాటు జీలకర్ర విషయంలోనూ కల్తీలు తప్పడం లేదు.
జీలకర్ర నాణ్యతను ఎలా పసిగట్టాలి..
కొద్దిగా జీలకర్రను తీసుకుని నీటిలో వేసి ఐదు నిమిషాలు నాననివ్వాలి. నీరు రంగు మారితే జీలకర్రలో కల్తీ జరిగినట్టే నిర్దారించుకోవాలి. అలాగే జీలకర్రలో వాసన లేకపోయినా కూడా అది కల్తీ జీలకర్రగా గుర్తించాలి.
జీలకర్రతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో జీలకర్రను కలిపి తాగితే చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ నీరు తాగడం వల్ల మలబద్దకం, గ్యాస్, అసిడిటీ, అజీర్తి ఇలాంటి సమస్యలు దూరం అవుతాయి.
కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్
జీలకర్ర వాటర్ తో శరీరంలో పెరుకున్న కొవ్వు కరిగిపోతుంది. అలాగే కిడ్నీలో చేరిన వ్యర్థాలు, రాళ్ళు కరిగిపోతాయి.
మానసిక సమస్యలకు..
డిప్రెషన్ లో ఉన్నవారికి కూడా జీలకర్ర మంచి సపోర్ట్ గా నిలుస్తుంది. జీలకర్ర, నిమ్మరసం, తేనె కలిపి టీలా చేసి తాగినా కూడా యాక్టివ్ గా మారతారు.
ఇది కూడా చదవండి: ఎన్నిసార్లు శుభ్రం చేసినా.. ఇంట్లో ఎప్పుడూ దుమ్ము కనిపిస్తూనే ఉందా..? ఈ టెక్నిక్‌ను పాటిస్తే నెలంతా..!
నిద్రలేమికి చెక్..
చాలామందిలో కనిపించే నిద్ర పట్టకపోవడం, నిద్రలేమి సమస్యకు జీలకర్ర మంచి ఔషదంగా పనిచేస్తుంది. జీలకర్రను వేయించి, టీలా చేసుకుని తాగితే ఈ సమస్య దూరం అవుతంది.
షుగర్ ఉన్నా కూడా
షుగర్ వ్యాధితో బాధపడేవారికి జీలకర్ర మంచి మందు. ఈ నీటిని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది.
Updated Date - 2023-09-25T10:43:28+05:30 IST