ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rice: మాడిపోయిన అన్నాన్ని తినడం మంచిదేనా..? చాలా మంది తెలియక చేస్తున్న పొరపాటు ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-07-24T16:38:39+05:30

బ్రిటన్ కు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ జనరల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అటుగంటిన అన్నాన్ని., మాడిన బిర్యానీ తినకూడదు. దీనిమీద పిల్లలు, పెద్దలకు అవగాహన కల్పించాలి.

Food and Pizza

మనం తినే ఆహారం రుచిగా ఉండాలని తయారుచేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఇది రుచిగా వచ్చినట్టే.. ఒక్కోసారి ఎక్కువ సెగమీద స్టవ్ మీద పెట్టి మరిచిపోతే మాత్రం మాడిపోతుంది. ముఖ్యంగా అన్నాన్ని దీనిని పాడేయలేక చాలా సందర్భాల్లో అన్నాన్ని పక్కనుంచి తీసుకుని తినేస్తూ ఉంటాం. చూస్తూ చూస్తూ అన్నాన్ని పారేయడానికి మనసురాక ఇలా చేస్తూ ఉంటాం.

చాలామందికి వేడి వేడి ఆహారం తినటం ఇష్టం.. అలాగే కాస్త మాడిన అన్నాన్ని కూడా తినడానికి ఇష్టడతారు. అన్నం కూరలు ఇలా వేటినైనా కాస్త మాడినా సరే తినేస్తారు. ఇందులో కొందరికి నిప్పులపై కాల్చిన ఆహారాన్ని తినడం ఇష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. దీనిమీద జరిగిన అధ్యయనాలు ఎలా ఉన్నాయంటే..

మాడిన ఆహారం, లేదా కాల్చిన ఆహారాన్ని తినటం వల్ల అనారోగ్యాల పాలవుతారు. ఇది లోపలికి వెళ్ళి మన శరీరానికి చాలా చేటు చేస్తుంది. అదెలాగంటే..

ఇది కూడా చదవండి: వామ్మో.. అసలు కారణం ఇదా..? వర్షాకాలంలో జామకాయలను తప్పకుండా తినాలని ఎందుకు చెప్తారంటే..!


ఈ ఆహారం చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. నిప్పులపై కాలిన ఆహారం, అలాగే పెద్ద సెగ మీద మాడిపోయిన అన్నం ఇలా ఇవి రెండూ కూడా అక్రిలమైడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది నేనుగా శరీరంలోకి వెళ్ళి నెమ్మదిగా అనారోగ్య గురిచేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిని పెంచుతుందట.

వీటిలో ముఖ్యంగా అడుగంటిన అన్నం, మాడిపోయిన బ్రెడ్, ఉల్లిపాయలు, మొక్క జొన్న వంటి ఆహారాలు తీసుకోకూడదు. వీటిని తినటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్రిటన్ కు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ జనరల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అటుగంటిన అన్నాన్ని., మాడిన బిర్యానీ తినకూడదు. దీనిమీద పిల్లలు , పెద్దలకు అవగాహన కల్పించాలి. అంతే కాకుండా ఈ పరిస్థితికి టోస్టింగ్,.రోస్టింగ్, గ్రిల్లింగ్. , డీ ఫ్రై చేసిన ఆహారాలను తీసుకోకూడదు.

Updated Date - 2023-07-24T16:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising