Water Fasting: అసలేంటీ ఈ వాటర్ ఫాస్టింగ్..? 72 గంటల పాటు కేవలం మంచినీళ్లు మాత్రమే తాగితే లాభమా..? నష్టమా..?
ABN, First Publish Date - 2023-11-27T15:37:11+05:30
రోజంతా నీరు మాత్రమే తాగుతారు. ఈ ఉపవాసం తరచుగా 24 గంటల నుంచి 72 గంటలు పాటు ఉంటుంది.
బరువు తగ్గడానికి, ఎన్నో మార్గాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పద్దతిలో డైటింగ్ చాలా ముఖ్యమైన అంశంగా ఉంటూ వస్తుంది. ఆహారం తీసుకోకుండా, లేదా మితమైన ఆహారం తీసుకునేలా ఇలా చాలా మార్గాలున్నాయి. అయితే రోజుకో కొత్త విధానం వస్తూ ఉన్నా ఫలితం ఉందని తెలిస్తే అంతా అదే రూట్ ఫాలో అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శరీరానికి హాని కలిగించకుండా డైటింగ్ పాటు, వివిధ రకాల ఉపవాసాలు చేయనవసరం లేకుండా బరువు తగ్గే ట్రెండ్ వస్తుంది. అయితే బరువు తగ్గడానికి శరీరాన్ని సక్రమంగా ఉంచుకోవడానికి ఈమధ్యకాలం కాస్త ఎక్కువమంది ఫాలో అవుతున్న ఉపవాసాలలో ఒకటి నీటి ఉపవాసం, నీటితో ఉపవాసం అంటే ఏమిటి, దానితో కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి, మనం అనేక రకాల ఆహారాలను తగ్గించుకుంటూ, పెంచుకుంటూ నానా తిప్పలూ పడుతూ ఉంటాం. ఇలా వైద్యుల సలహాలు,. సూచనలు లేకుండా చేయడం అంటే అది ప్రయోజనం కంటే హాని కలిగిస్తుంది. డైటింగ్ తో పాటు, వివిధ రకాల ఉపవాసాలు కూడా ఈ మధ్యకాలంలో చేస్తూ వస్తున్నారు. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిదేనా లేక ఎలాంటి హానినైనా కలిగిస్తాయా అనేది తెలుసుకోవాలి.
నీటి ఉపవాసం అంటే..
నీటి ఉపవాసంలో, నీరు తప్ప మరేదీ తాగకూడదు, తాగకూడదు. రోజంతా నీరు మాత్రమే తాగుతారు. ఈ ఉపవాసం తరచుగా 24 గంటల నుంచి 72 గంటలు పాటు ఉంటుంది. బరువు తగ్గడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గంగా ఆచరిస్తున్నారు. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. కొవ్వు తగ్గడం వల్ల బరువు కూడా తగ్గుతుంది.
ఈ డైట్ వల్ల కలిగే ప్రయోజనాలేంటి..
1. నీటి ఉపవాసం కణాలను రీసైకిల్ చేయడంలో, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమయ్యే దెబ్బతిన్న భాగాలను తొగలించడంలో సహకరిస్తుంది.
2. ఇది ఇన్సలిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దీనితో ఇన్సులిన్ మెరుగ్గా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని కారణంగా మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.
3. నీటి ఉపవాసం కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
ఇది కూడా చదవండి: 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత.. గర్భం దాల్చడం మంచిదేనా..? వైద్య నిపుణులు ఏం తేల్చారంటే..!
నష్టాలు ఏమిటంటే..
1. కేలరీల కొరత కారణంగా శరీరంలో శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును ఉపయోగిస్తుంది. దీనితో బరువును అగస్మాత్తుగా కోల్పోతారు. ఇది ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతుంది. తర్వాత బరువు అగస్మాత్తుగా బరువు పెరుగుతుంది. ఇది కూడా ఆరోగ్యానికి హాని చేస్తుంది.
2. నీరు మాత్రమే తాగడం వల్ల శరీరంలో శక్తి లోపం ఏర్పుడుతుంది. ఆయాసం, తల తిరగడం, వంటి సమస్యలు వస్తాయి. ఎలెక్ట్రోలైట్స్లో మార్పు ఉండవచ్చు. దీనితో రక్తపోటు పడిపోతుంది. గుండెకు అరిథ్మియా ప్రమాదం కూడా కలుగుతుంది. ప్రాణాలకు కూడా ముప్పు.
3. వాటర్ ఫాస్టింగ్ వల్ల డిహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. నీరు తాగిన తర్వాత డ్రీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం కాస్త వింతగా ఉన్నా, ఇదే నిజం. నీటిని మాత్రమే తినడం, మరేదీ తినకపోవడం అనేది ఈఊ పరిస్థితికి కారణం అవుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-27T15:37:14+05:30 IST