ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: కసరత్తులు అవసరం లేదండోయ్.. తింటూనే కొవ్వు కరిగించొచ్చు.. ఈ 5 ఆహార పదార్థాలను తింటే..!

ABN, First Publish Date - 2023-08-01T15:32:15+05:30

గ్రీన్ టీ జీవక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

food items

అధిక బరువు ఇవాల్టి రోజుల్లో కామన్ గా కనిపించే విషయమే. అందరిలోనూ ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఈ బరువును తగ్గించుకోవడానికి తెగ తాపత్రయం పడుతూ ఉంటారు. కానీ ఈ మొండి బరువు ఓ పట్టాన వదలదు. బరువు పెరగడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మొదట్లో కాస్త లావు పెరిగితే కానీ, విపరీతంగా బరువు పెరిగినప్పుడు మాత్రం శరీరంలోని కొవ్వు మొండిగా మారి తగ్గుదల పేరు తీసుకోనట్లే అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో అధిక బరువును వదిలించుకోవడానికి ఆహారంలో మార్పులు చేసుకోవడం తప్పని సరి.

ఈ మార్పుతో శరీరకంగా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు, అలాగే ఆహారంలో అధిక మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు, కొవ్వును కరిగించడంలో సహాయపడే ఆహార పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటంటే..

నేరేడు పండు

వర్షాకాలంలో నేరేడుపండు పుష్కలంగా దొరుకుతుంది. సీజనల్‌గా వచ్చే ఈ పండును తింటే శరీరంలోని కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. నేరేడు పండ్లను తిన్న తర్వాత చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతుంది.

నల్ల మిరియాలు

నల్ల మిరియాలు కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ మసాలా వాడటం వల్ల జీవక్రియను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. నల్ల మిరియాలు శరీరం ఇతర పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: ఓరి దేవుడో.. ఇదేం ట్విస్ట్.. మంచినీళ్లను ఎక్కువగా తాగితే జరిగేది ఇదేనా..?


దాల్చిన చెక్క

రుచికరమైన సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ఒకటి. ఇది మసాలా తయారీలో మాత్రమే కాకుండా తీపి వంటలలో కూడా ఉపయోగిస్తారు. దాల్చినచెక్కను తీసుకోవడం వల్ల ఇది కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది. దాల్చిన చెక్క పొడిని పెరుగు, కాఫీ, టీలో చేర్చకోవచ్చు. ఇది కేలరీలను ఇవ్వదు. అలాగే కొవ్వు తగ్గించడంలో ప్రముఖంగా పనిచేస్తుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ తీసుకోవడం బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటుంది. గ్రీన్ టీ జీవక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు.

జామున్

జామున్ తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన పండు. జామున్ తిన్నాక కడుపు నిండుగా ఉండడంతో పాటు పదే పదే ఆకలి అనిపించదు, దానివల్ల ఆహారం తగ్గిపోయి బరువు తగ్గే ప్రభావం కనిపిస్తుంది. ఇలాంటి ఆహారపు అలవాట్లతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. మీరూ ట్రై చేయండి.

Updated Date - 2023-08-01T15:32:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising