ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mouthwash vs Oil Pulling: అసలేంటీ ఈ అయిల్ పుల్లింగ్..? మౌత్ వాష్‌కు, దీనికి తేడాలేంటి.? రెండింటిలోనూ ఏది బెటర్ అంటే..!

ABN, First Publish Date - 2023-07-13T12:30:31+05:30

ఇది దంతాల మీద పాచిని పేరుకోకుండా, దంతక్షయం కలిగించే బ్యాక్టీరియాను నిరోధిస్తుంది.

Mouthwash
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇష్టమైన ఆహారం తినాలంటే దానికి దంతాల దృఢత్వం కూడా అవసరమే. పళ్ళు గట్టిగా, ఆరోగ్యంగా ఉంటేనే తినే ఆహారాన్ని ఎంజాయ్ చేయచ్చు. అదే పళ్ళు ఆరోగ్యంగా లేకపోతే మాత్రం ఏదీ తినలేం. అందుకోసం బ్రషింగ్ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవడం అవసరం. అలాగే నోటి శుభ్రతలో భాగంగా ఆహారం తీసుకున్న తర్వాత మౌత్ వాష్ తో క్లీన్ చేయడం చేస్తుంటాము. దంతాలు, చిగుళ్ళను రక్షించుకోవడానికి ఆయిల్ పుల్లింగ్‌ను ఉపయోగిస్తాము. ఇది ఒకప్పుడు అందరూ చేసేవారు. ఈమధ్యకాలంలో తగ్గినా, మళ్ళీ మొదలుపెడుతున్నారు. ఆయిల్ పుల్లింగ్ ఇది సహజమైన ఓరల్ కేర్ టెక్నిక్‌గా పనిచేస్తుంది. అయితే మౌత్ వాష్, ఆయిల్ పుల్లింగ్ రెండూ దంత సంరక్షణ పద్దతుల్లో ఏది మంచిది అనే విషయాన్ని తేల్చుకోవాలి.

మౌత్ వాష్, ఆయిల్ పుల్లింగ్ రెండూ నోటి పరిశుభ్రత కోసం ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. మౌత్ వాష్, ఆయిల్ పుల్లింగ్ మధ్య తేడాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

మౌత్ వాష్ ప్రయోజనాలు, దుష్ప్రభావాలు

మౌత్ వాష్ రసాయనిక ద్రావణంతో తయారై, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో ఉంటుంది. దీనితో నోటిని కడుక్కుంటూ ఉంటాం. ఇది తాజా శ్వాసను అందించి, నోటిలోని బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.

లాభాలు

బ్రషింగ్, ఫ్లాసింగ్ వంటి వాటితో చిగుళ్ల వ్యాధిని తగ్గిస్తుంది. ఇది క్లోరెక్సిడైన్ అనే బాక్టీరిసైడ్ భాగాన్ని కలిగి ఉంటుంది, ఇది బ్యాక్టీరియాను నియంత్రించడం, చిగుళ్ల వ్యాధిని నివారిస్తుంది. ముఖ్యంగా హాలిటోసిస్, దుర్వాసన ఉన్నవారిలో తాజా శ్వాసను అందిస్తుంది.

పరిమితులు

వాటిలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటే మౌత్ వాష్ మంట, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని మౌత్ వాష్‌లు చాలా బలంగా ఉంటాయి. ఇవి దంతాలకు మంచి చేసినా, దవడలను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి వీలైతే, ఆల్కహాల్‌లేని మౌత్‌వాష్‌లను ఉపయోగించండి.


ఇది కూడా చదవండి: వర్షం వస్తోందంటే చాలు పకోడీలు, సమోసాలు లాగించేస్తుంటారా..? మీరు చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే..!

ఆయిల్ పుల్లింగ్ ప్రయోజనాలు, దుష్ప్రభావాలు

నూనెను స్విష్ చేయడం (పుక్కిలి పట్టడం), సాధారణంగా ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెను కొన్ని నిమిషాల పాటు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఆయిల్ పుల్లింగ్ చేయాలి.

లాభాలు

ఇది సహజమైనది, రసాయనాలు లేనిది. ఒక బయోఫిల్మ్‌ను సృష్టిస్తుంది, ఇది దంతాల మీద పాచిని పేరుకోకుండా, దంతక్షయం కలిగించే బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. ఈ రెండు విధానాల్లో చిన్న చిన్న తేడాలున్నా దంతాలను సంరక్షించడంలో ముందుంటాయి. సరైన పద్దతిని ఎంచుకుని దంతక్షయం లేకుండా చూసుకోవాలి.

Updated Date - 2023-07-13T12:30:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising