Nails: గోర్లపై పగుళ్లు వస్తున్నాయా..? వాటంతట అవే విరిగిపోతున్నాయా..? ఈ 5 విషయాలు తెలుసుకోవాల్సిందే..!
ABN, First Publish Date - 2023-11-08T15:50:11+05:30
కొబ్బరి నూనె గోళ్ల ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. కొబ్బరి నూనెతో గోళ్లను మసాజ్ చేయడం వల్ల గోళ్లకు బలం చేకూరుతుంది.
ముఖం నుంచి మొదలుకొని కాలి గోర్ల వరకూ అందంగా తీర్చిదిద్దుకోవాలని చూస్తూ ఉంటాం. అయితే ముఖానికి ఎటువంటి క్రీమ్ రాసినా దాని తేడాను కొద్ది క్షణాల్లో తెలుసుకోవచ్చు. మరి చేతులు, కాళ్ల గోర్ల విషయానికి వస్తే మాత్రం గోర్లకు మన ఆరోగ్యానికి లంకె ఉంది. ఆరోగ్యం బావుంటే మన గోర్లు కూడా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. అదే ఆరోగ్యంలో చిన్న మార్పు వచ్చినా ముందుగా జుట్టుతో పాటు కాలి గోర్ల విషయంలో కూడా తేడా ఇట్టే కనిపిస్తుంది. గోర్లు పెళుసుగా మారడం, లేదా విరిగిపోవడం వంటివి తరచుగా చూస్తూ ఉంటాం. అయితే దీని నుంచి తప్పించుకోవాలంటే ఏంచేయాలి. ఎలాంటి ఇంటి చిట్కాలను పాటించాలి. తెలుసుకుందాం.
1. కొబ్బరి నూనె గోళ్ల ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. కొబ్బరి నూనెతో గోళ్లను మసాజ్ చేయడం వల్ల గోళ్లకు బలం చేకూరుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో గోళ్లను మసాజ్ చేయండి.
2. నారింజ కొల్లాజెన్ ఉత్పత్తికి చాలా సహాయపడుతుంది. కొల్లాజెన్ గోళ్ల పెరుగుదలను, గోళ్ల మెరుపును పెంచే ముఖ్యమైన ఏజెంట్. ఒక గిన్నెలో కొంచెం నారింజ రసం తీసుకోండి. తర్వాత ఆ రసంలో గోళ్లను నానబెట్టాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసి గోళ్లపై మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
3. పెళుసుగా ఉండే గోళ్లను నివారించడంలో ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది. ప్రతిరోజూ ఆలివ్ నూనెతో గోళ్లకు మసాజ్ చేయండి.
4. నిమ్మరసాన్ని గోళ్లపై రాసి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయడం వల్ల కూడా గోళ్లకు మంచిది. ఇది గోర్లు మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది.
5. గోళ్ల పటుత్వం పెరగాలంటే రోజ్ వాటర్, అలోవెరా జెల్ కలిపి గోళ్లపై రోజూ రాసి పది నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసి కడిగేయాలి.
Updated Date - 2023-11-08T15:50:12+05:30 IST