Chicken in Fridge: మిగిలిపోయిన చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం తప్పు కాదు కానీ.. ఎన్ని రోజుల్లోగా వాడేయాలో కూడా తెలుసుకోండి..!
ABN, First Publish Date - 2023-06-15T12:34:28+05:30
అసలు ఆహారాన్ని ఎన్ని రోజులు ఫ్రిజ్లో ఉంచాలి.
కాస్త అన్నం మిగిలిపోయినా, కూర మిగిలినా రాత్రి దానిని చిన్న గిన్నెల్లోకి తీసేసి, వాటిని ఫ్రిజ్ అరల్లో దాచేస్తూ ఉంటాం. ఇలా దాయడం అనేది ఒకటి రెండు రోజులు మాత్రమే చేస్తే పరవాలేదు. కానీ అంతకన్నా ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతున్నామా అనేది గమనించుకోవాలి. ముఖ్యంగా చికెన్ కూర మిగిలిపోయిందంటే మరనాడు తినేందుకు ఫ్రిజ్‌లో ఉంచుతారు.
అదే కాస్త ఎక్కువ చికెన్ తెచ్చినా వండకుండానే ఫ్రిజ్లో ఉంచేస్తాం ఇలా ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాన్ని తినడం వల్ల ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. అసలు ఆహారాన్ని ఎన్ని రోజులు ఫ్రిజ్లో ఉంచాలి. ముఖ్యంగా చికెన్ వండినదాన్ని, లేదా వండని చికెన్‌ని ఎన్ని రోజుల వరకూ ఫ్రిజ్లో ఉంచవచ్చు. అసలు ఎలా ఉంచాలి.
తరువాత వండుకోవచ్చని దాచే చికెన్‌ను ఎలా ఫ్రీజ్ చేయాలి.
పచ్చి లేదా వండిన చికెన్ ఫ్రిజ్‌లో కాకుండా ఫ్రీజర్‌లో నిల్వ చేయాలి. ఇలా చేయడానికి చికెన్‌ను ప్రత్యేకమైన FreezerWrapలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. దీనిని గాలి చొరబడని బాక్స్‌లో ఉంచాలి. అదే వండిన చికెన్ ఫ్రిజ్‌లో ఉంచినా కూడా ఫ్రిజ్ అరల్లో కాకుండా ఫ్రీజర్‌లో ఉంచడం మంచిది. ఇలా ఉంచే ముందు తరవాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
ఇది కూడా చదవండి: శరీరంలోకి చెడు కొవ్వు కరిగిపోవాలంటే.. రోజూ పొద్దున్నే పాలు తాగడానికి బదులుగా.. దీన్ని ట్రై చేయండి చాలు..!
ఒకసారి నిల్వ చేసిన తర్వాత, ఫ్రీజర్‌లో చికెన్ ఎంతసేపు ఉంటుంది?
చికెన్ 9 నెలల పాటు ఫ్రీజర్‌లో చెడిపోకుండా ఉంటుంది. అదే ఉడికించిన చికెన్‌ను గడ్డకట్టించేట్లయితే, అది 2 నుంచి 6 నెలల వరకు ఉంటుంది.
చికెన్‌ను కరిగించడం ఎలా?
చికెన్‌ను వేడి నీటిలో కరిగించకూడదు, గది ఉష్ణోగ్రత వద్ద 2 గంటల కంటే ఎక్కువసేపు ఉంచకూడదు. చికెన్ ఏదైనా దానిని వాడే ముందు నేరుగా నీటిలో పెట్టడమో, లేదా గది ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా బయట వదిలేయడమో చేయకూడదు. చికెన్ వాడే ముందు ఫ్రీజర్ నుంచి ఫ్రిజ్ అరల్లోకి మార్చాలి.
తరవాత నెమ్మదిగా కరిగించే పని చూడాలి. దీనికి రోజు సమయం పట్టవచ్చు. ఫుడ్ స్టోరేజ్ క్వార్ట్ బ్యాగ్‌ల నుంచి తీసిన చికెన్ని చల్లని కుళాయి నీటిలో ముంచి, ప్రతి 30 నిమిషాలకు నీటిని మార్చడం వలన అది కరిగిపోతుంది. మైక్రోవేవ్‌లో గడ్డ కట్టిన చికెన్‌ను కరిగించవచ్చు, కానీ ఆ పద్ధతిని ఉపయోగించాలనుకుంటే, బ్యాక్టీరియా పెరగకుండా కరిగిన వెంటనే ఉడికించాలి.
Updated Date - 2023-06-15T12:34:28+05:30 IST