ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Air Embolism: అసలేంటీ ఎయిర్ ఎంబోలిజం..? ఇంజెక్షన్‌తో గాలిని శరీరంలోకి పంపిస్తే చచ్చిపోతారా..?

ABN, First Publish Date - 2023-08-08T11:20:43+05:30

నీటి అడుగున ఉన్నప్పుడు శ్వాసను ఎక్కువసేపు పట్టుకుని ఉంటే ఎయిర్ ఎంబోలిజం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Symptoms.

ప్రాణాంతకమైన ఎయిర్ ఎంబోలిజమ్ కు చాలా కథే ఉంది. ఖాళీ సిరంజిలోకి గాలిని తీసుకుని ఆ గాలిని శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే చాలు ప్రాణం పోతుంది. దీనికోసం విషాన్ని తెచ్చి మరీ ప్రయోగించనవసరం లేదట. ఇదే విషయానికి సంబంధించి ఈమధ్య ఓ సంఘటన జరిగింది. ఇందులో ఒకరి ప్రాణాల మీదకువచ్చింది ఇంతకీ ఏమిటీ ఎయిర్ ఎంబోలిజం.. దీనికి ఏ విషం అవసరం లేకుండానే జనాల్ని చంపే శక్తి ఉందా? ఈ ఎంబోలిజమ్ గురించి తెలుసుకుందాం.

కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఒక మహిళను మరో మహిళ ఖాళీ సింరజితో మూడు నాలుగు పోట్లు పొడిచి చంపే ప్రయత్నం చేసింది. ఇది నిజమే.. సిరంజిలో ప్రత్యేకంగా ఎలాంటి మందునూ ఎక్కించకుండానే ఉత్త గాలితోనే చంపేయాలనుకుంది. దీనినే ఎయిర్ ఎంబోలిజం అంటారు. ఎయిర్ ఎంబోలిజం అనేది రక్తనాళంలో గాలి బుడగలు ఏర్పడటం వలన రక్త సరఫరాను అడ్డుకోవడం జరుగుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థలోకి గాలి ప్రవేశిస్తే అది ప్రాణాంతకం కాగలదు.

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గాలి బుడగలు రక్తనాళాలలోకి ప్రవేశించి వాటిని నిరోధించినప్పుడు ఎయిర్ ఎంబోలిజం ఏర్పడుతుంది. ఈ ఆర్టరీ ఎయిర్ ఎంబోలిజం గాలి బుడగలు మెదడుకు వెళ్లినప్పుడు, గుండెపోటు, స్ట్రోక్, శ్వాసకోశ వైఫల్యానికి దారితీయవచ్చు.

లక్షణాలు

మైనర్ ఎయిర్ ఎంబోలిజం లక్షణాలు ఏవీ ఉండకపోవచ్చు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసకోశ వైఫల్యం

ఛాతీ నొప్పి, గుండె వైఫల్యం

కండరాలు, కీళ్లలో నొప్పి

ఇది కూడా చదవండి: వాషింగ్ మెషీన్‌లో దుస్తులు ఉతికేటప్పుడు.. 4 ఐస్‌క్యూబ్స్‌ను వేస్తే.. ఏం జరుగుతుందో మీరే చూడండి..!


స్ట్రోక్

గందరగోళం, స్పృహ కోల్పోవడం; మానసిక స్థితిలో మార్పులు

అల్ప రక్తపోటు

చర్మం నీలం రంగులోకి మారుతుంది.

స్కూబా డైవింగ్

ఇది కూడా ఎయిర్ ఎంబోలిజానికి కారణం కావచ్చు. నీటి అడుగున ఉన్నప్పుడు శ్వాసను ఎక్కువసేపు పట్టుకుని ఉంటే ఎయిర్ ఎంబోలిజం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఊపిరితిత్తులలోని గాలి సంచులు చీలిపోయి ధమనులకు గాలి తరలించడానికి కారణమవుతుంది, ఇది ఎయిర్ ఎంబోలిజానికి దారితీస్తుంది. ఇదే కాకుండా అనేక ఇతర కారణాల వల్ల ఎయిర్ ఎంబోలిజంతో బాధపడవచ్చు.

Updated Date - 2023-08-08T11:20:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising