ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Papaya: చాలా మంది పట్టించుకోరు కానీ.. బొప్పాయితో ఇన్ని లాభాలా..? బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు..!

ABN, First Publish Date - 2023-11-29T17:26:51+05:30

బొప్పాయిలో ఉండే ఎంజైమ్ లు మెరుగైన జీర్ణక్రియ, జీవక్రియకు సహకరిస్తుంది. బరువు తగ్గడంలోనూ ముందుంటుంది.

papaya,

పచ్చి బొప్పాయి పోషకాహార శక్తిగా శరీరానికి సపోర్ట్ గా నిలుస్తుంది. ఈ ఉష్టమండల పండు తరచుగా తక్కువగా అంచనా వేయబడినప్పటికీ, ఇందులో చాలా శరీరానికి అవసరమైన పోషకాలు, ఎంజైమ్‌లు, యాంటీ ఆక్సిడెంట్స్ పచ్చి బోప్పాయిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇతర ప్రయోజనాలతోపాటు ఆరోగ్యకరమైన గుండె, జీర్ణ ఆరోగ్యానికి ఇది మంచి సపోర్ట్‌గా ఉంటుంది.

పోషకాలు అధికంగా..

పచ్చి బొప్పాయి మన శరీరానికి సరైన పోషకాలను అందిస్తుంది. ఇది విటమిన్లు సి, ఎ, ఇ, కె లు సమృద్ధిగా ఉన్నాయి. బి విటమిన్ల శ్రేణితో పాటు, శక్తివంతమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొత్తం జీవశక్తికి సపోర్ట్ ఇస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, ఎముక ఆరోగ్యాన్ని కాపాడేందుకు కీలకంగా పనిచేస్తుంది.

పచ్చి బొప్పాయి అద్భుతమైన జీర్ణకిరియకు సహాయపడుతుంది. ఇందులోని పాపైన్ అనే ఎంజైమ్, ప్రోటీన్ల విచ్చిన్నానికి మద్దతుగా నిలుస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. పచ్చి బొప్పాయిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్దకం తగ్గుతుంది. అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.


బరువు తగ్గిస్తుంది..

పచ్చి బొప్పాయిని డైటర్ తక్కువ కేలరీల ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది భోజనానికి ముందే తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి. అలాగే బొప్పాయిలో ఉండే ఎంజైమ్ లు మెరుగైన జీర్ణక్రియ, జీవక్రియకు సహకరిస్తుంది. బరువు తగ్గడంలోనూ ముందుంటుంది.

ఇది కూడా చదవండి: చపాతీలు చేసే వాళ్లలో 90 శాతం మందికి ఈ విషయం తెలిసి ఉండదు.. అందరూ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే..!

రోగ నిరోధక శక్తి..

వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు బొప్పాయి మంచిగా పనిచేస్తుంది. ఇందులోని అధిక విటమిన్ సి కంటెంట్ తో పచ్చి బొప్పాయి రోగనిరోధక ప్రతిస్పందనను పెంచుతుంది. ఇన్పెక్షన్ల నుంచి రక్షణనిస్తుంది.

చర్మం, జుట్టు

పచ్చి బొప్పాయిలో ఉన్న ఇంకా మంచి గుణాలలో ఇది చర్మానికి , జట్టుకు మంచి సపోర్ట్ గా నిలుస్తుంది. బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లతో అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది.మెటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. జట్టును ధృఢంగా ఉంచుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది సహాయపడుతుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-29T17:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising