Health Tips: 30 ఏళ్ల వయసు దాటిన వెంటనే.. తప్పకుండా చేయించుకోవాల్సిన 5 టెస్టులు ఇవే..!
ABN, First Publish Date - 2023-08-28T13:01:17+05:30
సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం ద్వారా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా అంతే ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ మన శరీరంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్ల, 30 ఏళ్లు నిండి ఉంటే, కొన్ని పరీక్షలు తప్పక చేయించుకోండి, తద్వారా ఏదైనా సమస్య ఉందని తేలితే సకాలంలో చికిత్స చేయించుకునే వీలుంటుంది. మనషికి 30 ఏళ్ల వయస్సు చాలా విధాలుగా ప్రత్యేకమైనది. ఆరోగ్యకరమైన రీతిలో మిగతా రోజులు గడవడానికి ఈ 5 పరీక్షలను తప్పక చేయించుకోవాలి.
రక్త చక్కెర పరీక్ష
నేటి జీవనశైలి ఆధారంగా, 30 తర్వాత బ్లడ్ షుగర్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. పాస్టింగ్ షుగర్ తిన్న రెండుగంటల తర్వాత చేయాలి. ఇక మూడు నెలల షుగర్ లెవల్ చెప్పగలిగే హెచ్‌బిఎ1సి పరీక్ష కూడా క్రమం తప్పకుండా చేయించుకోవాలి.
రక్తపోటు
ఒత్తిడితో కూడిన జీవితంలో కేకలు వేయడం, చిన్నమాటకే కోపం తెచ్చుకోవడం సాధారణ అంశంగా మారిపోయింది. అటువంటి పరిస్థితిలో, రక్తపోటు వేగంగా పెరుగుతుంది. ఈ పరిస్థితి కొద్దికాలం ఉంటే హఠాత్తుగా ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. ఇది పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, గుండెపోటు వంటి సమస్యలకు దారితీస్తుంది, కాబట్టి రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం ముఖ్యం. ఇంట్లోనే రక్తపోటును కొలవడానికి డిజిటల్ యంత్రాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: హార్ట్ అటాక్ అంటే ఏమిటి..? పానిక్ అటాక్ అంటే ఏమిటి..? రెండిటి మధ్య అసలు తేడాలేంటంటే..
లిపిడ్ ప్రొఫైల్
ఈ గుండె ఆరోగ్య పరీక్ష శరీరంలోని హెచ్‌డిఎల్, ఎల్‌డిఎల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిని గుర్తించి ఆరోగ్యకరమైన గుండెను సూచిస్తుంది. రిపోర్టు నార్మల్‌గా వచ్చినా, ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి రెండేళ్లకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి.
థైరాయిడ్ ఫంక్షన్ పరీక్ష
ఇది హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని పిలవబడే థైరాయిడ్ అండర్ యాక్టివ్, ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ కి సంబంధించిన పరీక్ష. థైరాయిడ్ స్థాయిలలో ఆటంకాలు బరువు పెరగడం, ప్రవర్తనలో మార్పులు, పీరియడ్స్‌లో మార్పులు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.
లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT), కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (KFT)
కామెర్లు, సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ మొదలైనవాటిని సంవత్సరానికి ఒకసారి LFT చేయడం ద్వారా నివారించవచ్చు. మద్యం సేవించే వారికి ఈ పరీక్ష చాలా ముఖ్యం. KFT చేయడం ద్వారా, రక్తంలో క్రియేటినిన్ మొత్తం కనుగొనబడుతుంది, ఇది తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి , గ్లోమెరులోనెఫ్రిటిస్ వంటి వ్యాధులను గుర్తిస్తుంది.
వీటితో పాటు సీబీసీ (Complete blood count), యూరిన్ టెస్ట్, విటమిన్ డి టెస్ట్, Pap smear test, క్యాన్సర్ స్క్రీనింగ్, మామోగ్రఫీ తదితర పరీక్షలు కూడా క్రమం తప్పకుండా చేయించుకోవాలి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం ద్వారా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. అందుకే ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 30 ఏళ్లు దాటిన వెంటనే అవసరమైన అన్ని పరీక్షలను చేయించుకోవాలి.
Updated Date - 2023-08-28T13:01:17+05:30 IST