Pomegranate Juice: దానిమ్మ జ్యూస్‌ను అసలెందుకు తాగాలి..? ఈ 10 కారణాల లిస్ట్ చూస్తే..!
ABN, First Publish Date - 2023-11-20T13:05:13+05:30
మెదడు పనితీరును మెరుగుపరుస్తూ, జ్ఞాపకశక్తి లోపాలను సరిచేస్తుంది.
నీరసంగా ఉన్నవారిలో తక్షణం శక్తిని నింపాలన్నా, రక్తహీనతతో బాధపడేవారికి రక్తం పట్టాలన్నా దానిమ్మను తీసుకోమని సలహా ఇస్తారు డాక్టర్లు. గుబురు పొదల్లో, గుండ్లటి, ఎర్రని పండ్లు, మందపాటి, తోలుతో చిన్న ఎర్రటి విత్తనాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తినేందుకు అనువుగా ఈ గింజలు తియ్యగా ఉంటాయి. లోపలి చిన్న గింజలు కూడా తినేందుకు బావుంటాయి. అందుకేనేమో పిల్లలు, పెద్దలూ అంతా దానిమ్మను ఇష్టపడతారు. దానిమ్మ పండు రసంలో చాలా పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా పాలీఫెనాల్స్, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతుంది. ఈ రసాన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.
1. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
దానిమ్మ రసం శక్తివంతమైనదే కాదు, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడానికి, ఆక్సీకరణ ఒత్తడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దార్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
2. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
దానిమ్మ రసం రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ విషయంలోను స్థాయిలను నియంత్రిస్తుంది. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.
3. లక్షణాలు..
దానిమ్మ రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలున్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వివిధ దార్ఘకాలిక పరిస్థితులతో ముడి పడి ఉంటుంది.
జీర్ణక్రియను మెరుగపరుస్తుంది.
దానిమ్మ రసం అతిసారం, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధిని తగ్గించే గుణంతో పాటు, జీర్ణ సమస్యలకు సహజ నివారణగా ఉపయోగపడుతుంది.
5. రోగనిరోధక శక్తి
దానిమ్మరసంతో విటమిన్ సి ఎక్కువగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది.
6. కొన్ని క్యాన్సర్లు..
దానిమ్మ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించవచ్చు.
ఇది కూడా చదవండి: మెదడు పనితీరును మెరుగుపరుస్తూ, జ్ఞాపకశక్తి లోపాలను సరిచేస్తుంది.
7. ఆరోగ్యమైన చర్మం
దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని రక్షించి నిగారింపును తెస్తాయి.
8. మెదడు పనితీరు..
మెదడు పనితీరును మెరుగుపరుస్తూ, జ్ఞాపకశక్తి లోపాలను సరిచేస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయి..
ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరచడానికి రక్తలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ సహాయపడుతుంది.
10. బరువు తగ్గడంలో..
దానిమ్మ రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు కంట్రోల్ చేయడానికి ఇది మంచి సపోర్ట్ ఇస్తుంది.
Updated Date - 2023-11-20T13:06:50+05:30 IST