Pregnancy: 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత.. గర్భం దాల్చడం మంచిదేనా..? వైద్య నిపుణులు ఏం తేల్చారంటే..!
ABN, First Publish Date - 2023-11-27T15:24:31+05:30
40 ఏళ్ళు వచ్చేసాకా మహిళలు గర్భం దాల్చడం అంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనీయడం అంటే అది ఎంతో ఆనందకరమైన విషయం. తల్లి కాబోతున్నాననే విషయాన్ని స్త్రీ మరింత శ్రద్ధగా తీసుకుంటుంది. తనలో శరీరంలో వస్తున్న మార్పులను స్వాగతిస్తుంది. అయితే వయసు పెరుతున్న కొద్దీ అంటే 40 ఏళ్ళకు దగ్గరవుతున్న వారిలో శరీరంలో వచ్చే మార్పులతో ప్రెగ్మెన్సీ అనేది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. అప్పటికే స్త్రీ శరీరంలో వచ్చే మార్పులు, మోనోపాజ్ సమస్యకు కూడా దగ్గర కావడం వంటివి అనేక అనారోగ్య సమస్యలను తెస్తుంది. గర్భానికి ఈ ఏజ్ కూడా సాధ్యమే నంటున్నారు వైద్యులు.
సంతానోత్పత్తి సవాళ్ళు..
వయస్సుతో పాటు స్త్రీ సంతానోత్పత్తి క్షీణించడం మొదలవుతుంది. సహజంగా గర్భం దాల్చడం అనేది సవాలుగా మారుతుంది. 35 సంవత్సరాలు వయస్సు తర్వాత స్త్రీ గుడ్ల పరిమాణం, నాణ్యత తగ్గుతుంది. ఇది గర్భం దాల్చడాన్ని కష్టతరం చేస్తుంది. 40 ఏళ్ళు పైబడిన మహిళలకు ప్రతి నెల గర్భవతి అయ్యే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.
వైద్య సహాయం: 40 ఏళ్ళు పైబడిన మహిళలకు మరింత తరచుగా ప్రినేటల్ చెక్ అప్ అవసరపడుతుంది. స్త్రీ ఆరోగ్య స్థితిని, గర్భం దాల్చేందుకు ఉన్న వీలును ఇది బయటపెడుతుంది.
ఆరోగ్య పరిస్థితి : వైద్యులు 40 ఏళ్ళు పైబడిన స్త్రీల విషయంలో మధుమేహం, రక్తపోటు సమస్యలను ముందుగానే పరీశీలిస్తారు. తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదాలు తగ్గేందుకు తగిన చర్యలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు.
ఇది కూడా చదండి: పంచదార వాడకం ఎక్కువయితే.. ఈ 10 సమస్యలు తప్పవ్..!
40 ఏళ్ళ తర్వాత గర్భంతో సంబంధం ఉన్న ప్రమాదాలు,..
గర్భస్రావం ప్రమాదం.. గర్భస్రావం ప్రమాదం తల్లి వయస్సుతో పెరుగుతుంది. పెరుగుతున్న పిండంలో క్రోమోజోమ్ అసాధారణతలకు కారణం అవుతుంది. దీనికి ప్రినేటల్ కేర్ అలాగే పర్యవేక్షణ అవసరం.
గర్భధారణలో మధుమేహం; 40 ఏళ్ళు వచ్చేసాకా మహిళలు గర్భం దాల్చడం అంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తల్లి, బిడ్డ ఇద్దరికీ ఇది ప్రమాద పరిస్థితి కావచ్చు. పెద్ద జనన బరువు, సిజేరియన్ ఈ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది.
హైపర్ టెన్షన్, ప్రీక్లాంప్సియా.. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు, ప్రిఎక్లాంప్సియా సమస్యలకు పర్యవేక్షణ, ప్రినేటల్ కేర్ అవసరం.
ముందస్తు జననం.. ప్రసూతి వయస్సతో మరో పరిస్థితి ముందుగానే బిడ్డ పుట్టడం, ఇది నవజాత శిశువు ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.
ఎక్కువ గర్భాలు.. సంతానోత్పత్తి చికిత్సలు చేయించుకున్న మహిళలు, 40 ఏళ్ళు పైబడిన వారిలో సాధారణంగా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది పుట్టిన వారిలో తల్లిలో కూడా చాలా సమస్యలను తెస్తుంది. వైద్య శాస్త్రంలో పురోగతి, ప్రినేటల్ కేర్, జీవనశైలి సర్దుబాట్లు విజయవంతమైన ఫలితాలను ఇచ్చినా 40 ఏళ్ళకు లోపే బిడ్డల విషయంగా ఫ్లానింగ్‌లో ఉండటం అన్ని విధాలా మంచిది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-27T15:24:33+05:30 IST