Bad Dreams: చెడ్డ కలలు ఎందుకొస్తాయ్..? రాత్రిళ్లు పడుకోబోయే ముందు చేసే ఈ ఒక్క పని వల్లేనా..?
ABN, First Publish Date - 2023-07-14T14:24:09+05:30
మానసిక కారకాలు కొన్నిసార్లు పీడకలలు రావడానికి దోహదం చేస్తాయి.
తరచుగా పీడకలలు వస్తున్నాయా? అయితే, దీనికి మీ డైట్ కారణమని తెలిస్తే షాక్ అవుతారేమో. నిజానికి రాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఏదో పెద్ద ఎత్తు నుంచి పడిపోతున్నట్టుగా, పెద్ద చెట్టు విరిగిపోతున్నట్టుగా, పాములు, పెద్ద వాహనాలు మీదకు వస్తున్నట్టుగా ఇలా చాలా రకాల చెడ్డ స్వాప్నాలు వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకుని బాధపడేవారే ఎక్కువ. ఇలాంటి కలల వల్ల ఏదో చెడు జరగబోతుందని, దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రయత్నించడానికి సతమతం అవుతుంటారు.
నిజానికి దీని వెనుక రాత్రి మనం తీసుకునే ఆహారం చాలా వరకూ కారణమట. నిజంగానే మనం తీసుకునే ఆహారంతోనే ఇలాంటి కలలు తరచుగా వస్తాయట. దీనికి పరిష్కారం ఏంటో కూడా చూద్దాం. పరిశోధన ప్రకారం, నిద్రపోయే ముందు తినే ఆహారం నిద్ర నాణ్యతను తగ్గించి, కలలను కనే విధంగా ప్రభావితం చేస్తుంది. తినేదాన్ని చాలా ఆలోచనాత్మకంగా ఎంచుకోవాలి. పీడకలలు వచ్చే అవకాశాలను తగ్గించుకోవడానికి ఏ ఆహారాలు, పానీయాలు తీసుకోవాలి?
చెడు కలలను నివారించడానికి తినే ఆహారంలో 3 పదార్థాలను చేర్చండి.
1. జాజికాయతో పాలు
జాజికాయ చూర్ణాన్ని కలిపిన పాలు తీసుకోవడం వల్ల అవి శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. నిద్ర నాణ్యత, కలలు కనడానికి సంబంధించిన REM నిద్రను ప్రభావితం చేస్తుంది. మంచి నిద్ర కోసం, గోరువెచ్చని పాలలో 1 టీస్పూన్ తురిమిన జాజికాయ పొడిని కలపండి. జాజికాయలో మిరిస్టిసిన్ అనే సమ్మేళనంతో పాటు, చిన్న మొత్తంలో మెలటోనిన్ కూడా ఉంటుంది, ఇది సిర్కాడియన్ రిథమ్‌ను అనుసరించడంలో సహాయపడుతుంది. నిద్రవేళకు మూడు గంటల ముందు బ్లూ లైట్, గాడ్జెట్‌లను, ఫోన్స్, ల్యాప్ టాప్ లను వాడకూడదు. అలాగే కంప్య్వూటర్ వర్క్ చేయకూడదు. గదిని చల్లగా ఉంచడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. పీడకలలు కూడా తగ్గుతాయి. సుఖమైన నిద్ర వస్తుంది.
2. అరటి
అరటిపండు మంచి నాణ్యమైన నిద్రను ఇస్తుంది. పీడకలలు తరచుగా పెరిగిన ఒత్తిడి, ఆందోళన, న్యూరోట్రాన్స్మిటర్ అసమతుల్యతతో సంబంధం కలిగి ఉంటాయి. పడుకునే ముందు అరటిపండు తినండి. ఇందులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది, మెదడులో సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా మానసిక ప్రశాంతత, మంచి నిద్ర, పీడకలలు తగ్గుతాయి. అరటిపండ్లు పొటాషియం, మెగ్నీషియం, ట్రిప్టోఫాన్‌లకు మంచి మూలం. ఈ పోషకాలు శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, నిద్ర, కలల నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: పాతికేళ్ల వయసు లోపే ఈ హార్ట్ అటాక్స్ ఏమిటి..? ఈ 4 ఆహార పదార్థలు కూడా కారణమేనా..?
3. ఆయిల్ ఫిష్
జిడ్డుగల చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి పుష్కలంగా ఉన్నాయి, ఇవి మెరుగైన మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయి. మానసిక స్థితిని మెరుగుపరచడం, ఒత్తిడి స్థాయిలను తగ్గించడం కలలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. సాల్మన్, మాకేరెల్ వంటి జిడ్డుగల చేపలలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. విటమిన్ డి లోపం వల్ల డిప్రెషన్, ఆందోళనతో సహా వివిధ మానసిక ఆరోగ్య పరిస్థితులు పెరిగే ప్రమాదం ఉంది. ఈ మానసిక కారకాలు కొన్నిసార్లు పీడకలలు రావడానికి దోహదం చేస్తాయి. విటమిన్ డి పీడకలల ఫ్రీక్వెన్సీ, తీవ్రతను తగ్గిస్తుంది.
ఈ ఆహారాన్ని తినవద్దు.
పీడకలలు వచ్చే అవకాశాలను తగ్గించడానికి, నిద్రవేళకు కొన్ని గంటల ముందు కెఫిన్, ఆల్కహాల్, హెవీ స్పైసీ ఫుడ్, హై షుగర్ ఫుడ్ తీసుకోవడం మానుకోవాలి.
Updated Date - 2023-07-14T14:24:09+05:30 IST