Best snacks: శీతాకాలం సాయంత్రాలు తీసుకునే టాప్ 7 హేల్తీ స్నాక్స్ ఇవే..!
ABN, First Publish Date - 2023-11-18T15:13:21+05:30
వేడి వేడి స్నాక్స్ గా వెచ్చగా కాఫీలు, సూపులు, క్రిస్పీ చిప్స్, వేడి వేడి స్నాక్స్ ఇటువంటివే ఎక్కువగా తింటూ ఉంటారు.
శీతాకాలం వచ్చిందంటే సాయంత్రాలు వేడి వేడిగా ఏదైనా తినాలిపిస్తుంది. సాయంత్రం తయారుచేసుకునే చాలా రకాల స్నాక్స్ ఆరోగ్యాన్ని కూడా పెంచేలా ఉండాలి,. ఇది కీళ్ళ ఆరోగ్యం, రోగ నిరోధక శక్తిని, చర్మంలో నునుపుదనం పెరుగుతుంది. దీనికోసం వేడి వేడి స్నాక్స్ గా వెచ్చగా కాఫీలు, సూపులు, క్రిస్పీ చిప్స్, వేడి వేడి స్నాక్స్ ఇటువంటివే ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఈ స్నాక్ టైంలో ఆరోగ్యాన్ని పెంచే వాటిని ఏవి తీసుకోవాలి అనేది చూద్దాం.
శీతాకాలం కోసం ఆరోగ్యకరమైన స్నాక్స్..
వేయించిన చిక్సీస్ (Chickpeas)..
శనగలు ఉడికించి తినడం అనేది మామూలుగా తినేదే.. అయితే నూనెలో వేయించిన శనగలు ఇంకా రుచిగా ఉంటాయి. వీటికి మసాలా జోడించి తీసుకుంటే నోటికి రుచిగా ఉండటమే కాదు. ఆరోగ్యానికి కూడా మంచిదే.
బెర్రీలు, వాల్ నట్స్..
బెర్రీలను, వాల్ నట్స్ తో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. దీనికి క్రీమ్ కలిపితే మరింత రుచిగా ఉండటమే కాదు, యాంటీ ఆక్సిడెంట్ల మోతాదుతో కలిపి, బ్లూబెర్రీస్, రాస్ప్బర్రీస్ వంటివి తీసుకోవచ్చు.
స్వీట్ పొటాటో చిప్స్..
స్వీట్ పొటాటో సన్నని ముక్కులు చేసి, ఆలివ్ నూనెలో కలిపి తీసుకుంటే రుచిగా ఉంటాయి. ఇవి చిప్స్ లా అయితే మరింత కరకరలాడుతూ తినేందుకు ఉత్సాహాన్నిస్తాయి. అలాగే ఆరోగ్యానికి మంచిదే.
వింటర్ ఫ్రూట్ సలాడ్..
సిట్రస్ పండ్లలో నారింజ, ద్రాక్ష, దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి మంచి సపోర్ట్ నిస్తాయి.
ఇది కూడా చదవండి: 40 ఏళ్ళ తర్వాత ఫిట్ గా, యవ్వనంతో ఉండాలంటే ఈ అలవాట్లు తప్పక పాటించాల్సిందే..!
డార్క్ చాక్లెట్, బాదం
కోకో డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక దీనికి బాదం కలిపి తీసుకుంటే ఆరోగ్యంతో పోటు మంచి రుచి కూడా తోడవుతుంది.
కూరలతో స్నాక్స్
క్యారెట్, దోసకాయ, బెల్ పెప్పర్, రంగురంగుల కూరగాయలన్నీ కలిపి తీసుకోవడం చూడడానికి అందమైన లుక్ ఇస్తుంది. అలాగే మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ ఫుడ్ అందినట్టే..
శీతాకాలంలో వోట్మీల్..
వోట్మీల్ చక్కెర లేకుండా తూసుకుంటే సాయంత్రాలు కడుపులో వెచ్చని ఫీలింగ్ ఉంటుంది. దానితో పాటు ఆరోగ్యానికి కూడా మంచి సపోర్ట్ గా నిలుస్తుంది.
Updated Date - 2023-11-18T15:13:24+05:30 IST