health : అలివ్ విత్తనాల నుండి దానిమ్మ వరకు, తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలున్న 5 ఐరన్-రిచ్ ఫుడ్స్.. !
ABN, First Publish Date - 2023-11-17T15:25:51+05:30
దానిమ్మ రుచిలో మాత్రమే కాదు ఇందులోని పోషకాలలో కూడా బెస్టే.. దానిమ్మలోని ఇనుముతో పాటు విటమిన్ సి కంటెంట్ కూడా ఆరోగ్యాన్ని పెంచడంలో సహకరిస్తుంది.
హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్ఇది శరీరమంతా ఆక్సిజన్ ను తీసుకువెళ్ళడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. హిమోగ్లోబిన్‌ను తయార చేయడానికి, కణాలకు హిమ్ అనే భాగాన్ని నిర్మించడానికి ఇనుము అవసరం. శరీరం ఇనుమును సరిగ్గా గ్రహించకపోతే శరీరం ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయదు. దీనితో రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. రక్తహీనత వల్ల అలసట, బలహీనత ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
అలీవ్ విత్తనాలు..
అలీవ్ విత్తనాలు, గార్జెన్ క్రెస్ సీడ్స్ లేదా హలీమ్ సీడ్స్ ( garden cress seeds or halim seeds ) అని పిలుస్తారు. ఇది ఇనుము కంటెంట్ ను ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇనుముతో పాటు అలివ్ విత్తనాలలో కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి వంటి ఇతర పోషకాలు కూడా నిండి ఉంటాయి. ఇందులోని ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
దానిమ్మ
దానిమ్మ రుచిలో మాత్రమే కాదు ఇందులోని పోషకాలలో కూడా బెస్టే.. దానిమ్మలోని ఇనుముతో పాటు విటమిన్ సి కంటెంట్ కూడా ఆరోగ్యాన్ని పెంచడంలో సహకరిస్తుంది. తాజా దానిమ్మ రసం తాగితే హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడమే కాదు విటమిన్లను, ఖనిజాలను కూడా పెంచుతుంది.
బచ్చలి కూర..
బచ్చలి కూర ఐరెన్ రిట్ ఫుడ్ ఇది. ఆకు కూరల్లో ప్రత్యేకమైనది. బచ్చలికూరలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి కీరకమైన ఫోలేట్, ఐరెన్ శోషణను మెరుగుపరచడానికి విటమిన్ సి ముఖ్యమైన పోషకాలు. చాలా రకాల పదార్థాలలో కలగలుపుగా చేర్చి బచ్చలి కూరను కలిపి తినవచ్చు.
గుడ్లు
గుడ్లలో ఐరెన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్లలో దాదాపు ఒక గ్రాము ఇనుము ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని పెంచడంలో సహకరిస్తుంది.
సిట్రస్ పండ్లు, నిమ్మ, నారింజ
నారింజ, నిమ్మ కాయలలో ఇనుము అధికంగా ఉంటుంది. సిట్రస్ పండ్లు విటమిన్ సితో నిండి ఉంటాయి. ఐరన్ రిచ్ ఫుడ్స్ తో కలిపి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచి సపోర్ట్ ఇస్తుంది.
Updated Date - 2023-11-17T15:25:53+05:30 IST