Headache: తలనొప్పితో ఎవరైనా చనిపోతారా..? 25 ఏళ్ల ఈ వ్యక్తికి అదే జరిగింది.. డాక్టర్లు అనుకున్నదొకటి.. జరిగింది మాత్రం..!
ABN, First Publish Date - 2023-09-29T12:45:36+05:30
తలనొప్పితో పాటు, మెదడు క్యాన్సర్ కూడా మూర్చలు, తరచుగా వాంతులు, మతి మరపు, వ్యక్తిత్వంలో మార్పు , కంటిచూపు సరిగా లేకపోవడం, మాట్లాడటంలో ఇబ్బంది ఉంటాయి.
మగవారిలో తలనొప్పికి కారణాలు అనేకం. తరచుగా తలనొప్పి వస్తుంటే దానిని తేలికగా తీసుకోకూడదు. ఇది మెదడు కణితి లేదా మెదడు క్యాన్సర్ మొదటి లక్షణం కావచ్చు. రాబోతున్న ప్రమాదాన్ని వదలని తలనొప్పితో ముందుగానే తెలియజేస్తుంది. మెదడు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం..
తలనొప్పి చిన్నదా లేదా?
తలనొప్పి చాలా చిన్న సమస్యలా అనిపిస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నిసార్లు వస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి ఇది మరీ ప్రాణాంతకం కావచ్చు. వైద్య నివేదికల ప్రకారం.. సౌత్ ఈస్ట్ లండన్ లో ఉంటున్న 25 ఏళ్ళ జాషువా వార్నర్ కు దాదాపు 15 రోజులుగా తలనొప్పి ఉంది. అది సాధారణమే అనుకున్నాకా.. అతను మరణించాడు.
మొదటి సారి వెళ్ళినపుడు డాక్టర్ గుర్తించలేదు..
భయంకరమైన వ్యాధిని గుర్తించలేని డాక్టర్ తప్పిదం వల్ల వార్నర్ మరణం సంభవించింది. తలనొప్పి కారణంగా అతనికి మూ స్కాన్ చేయగా, అతనికి ఆపండిసైటిస్ అని నిర్థారించారు. ఆపరేషన్ చేసి అపెండిక్స్ తీసేశారు.
మెదడులో లోపం ఉందికానీ..
శస్త్రచికిత్స తర్వాత కూడా 25 ఏళ్ళ అతని పరిస్థతి ప్రమాదంగా మారింది. మళ్ళీ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాకా చేసిన టెస్టుల్లో అతనికి మెదడులో కణతి ఉందనే విషయం బయటపడింది.
ఇది కూడా చదవండి: 5 నెలల్లో ఐదుగురు వ్యక్తులు.. ఒకే రకం లక్షణాలతో ఆస్పత్రిలోకి.. అసలు ఇదేం వ్యాధి అని వైద్యశాస్త్రాలు తిరగేస్తే..!
మెదడు క్యాన్సర్ చివరి దశగా గుర్తించారు..
కొన్ని వారాల తర్వాత జాషువా స్పృహ తప్పి పడిపోయాడు. సిటి స్కాన్ తర్వాత అతనిది చివరి దశ అనే విషయం తెలిసింది. ఇది అతని మెదడు కుడి భాగంలో వెనుక కాండం వరకూ వ్యాపించింది.
మెదడు క్యాన్సర్ దశ..
NHS మెదడు క్యాన్సర్ నాలుగు దశలను వివరించింది. గ్రేజ్ 1, గ్రేడ్ 2 మెదడు కణితులు చాలా చిన్నవి, నెమ్మదిగా పెరుగుతాయి. ఈ కణితి గ్రేడ్ 3, గ్రేడ్ 4 చేరుకునేప్పుడు ఇది ప్రాణాంతకం అవుతుంది. చాలా త్వరగా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.
ఈ సమయంలో తలనొప్పి పెరుగుతుంది..
మెదడు క్యాన్సర్ మొదటి లక్షణం తలనొప్పి, ఈ తలనొప్పి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది తరచుగా ఉదయాన్నే ఎక్కువవుతుంది. దగ్గు, ఒత్తిడి ఎక్కవ అయినప్పుడు నొప్పి కలుగుతుంది.
ఈ లక్షణాలను కూడా గమనించండి.
తలనొప్పితో పాటు, మెదడు క్యాన్సర్ కూడా మూర్చలు, తరచుగా వాంతులు, మతి మరపు, వ్యక్తిత్వంలో మార్పు , కంటిచూపు సరిగా లేకపోవడం, మాట్లాడటంలో ఇబ్బంది ఉంటాయి.
Updated Date - 2023-09-29T12:45:36+05:30 IST