Radish : కూరల్లో ముల్లంగి తినేది తక్కువేనా.. అయితే చాలా నష్టపోతున్నట్టే.. ముల్లంగిని తరచుగా తింటే..!!
ABN, First Publish Date - 2023-10-21T11:37:42+05:30
కానీ కొన్ని సందర్భాల్లో ముల్లంగిని అసలు తినకూడదు. ఇలా చేయడం వల్ల కడుపు నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఆకు కూరల్లో మంచి పోషకాలున్నాయని తింటూ ఉంటాం. అలానే దుంప కూరల్లోనూ చాలా పోషకాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా వరకూ సపోర్ట్ గానిలుస్తాయి. అయితే చాలా మంది తినేది. కొందరు అస్సలు ముట్టుకోని దుంపజాతి కూరగాయ ముల్లంగి. సాధారణంగా ముల్లంగిని వంటకాల్లో ఉపయోగించేది తక్కువే. ముల్లంగిని పరోటాతో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
మామూలుగా పరోటాలు బఠానీలు, మెంతులు, ముల్లంగి, బతువా లతో తయారు చేస్తారు. ఇవి చాలా రుచికరంగా తినడానికి బావుంటాయి. అంతేకాదు వీటితో ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఉంది. అవేంటంటే..
ముల్లంగి పరాటాలను తింటే...
ముల్లంగి పరాటాలు జీర్ణవ్యవస్థకు చాలా సహాయపడుతుంది. ముల్లంగిలో జీర్ణక్రియను మెరుగుపెరిచే గుణాలున్నాయి. ముల్లంగి పేగులను శుభ్రపరిచే గుణాలున్నాయి.
పేగుల్లోని వ్యర్థాలను శుభ్రపరచడంలో ముల్లంగి ముందుంటుంది. అజీర్ణం, మలబద్దకం సమస్యను తొలగిస్తుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే నిమ్మరసం తీసుకుంటున్నారా? మీకీ సంగతి తెలుసా..!
లివర్ సంబంధిత వ్యాధులను కూడా నయం చేయడంలో ముల్లంగి సహకరిస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్ లను కాలేయాన్ని నిర్విషీకరణ చేయడమే కాకుండా దాని కణాలను రిపేర్ చేస్తాయి.
ముల్లంగితో చేసే పరోటాలు చాలా రుచికరంగా ఉంటాయి. దీనితో కడుపునొప్పి ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో ముల్లంగిని అసలు తినకూడదు. ఇలా చేయడం వల్ల కడుపు నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఉపవాసం చేస్తున్నారు ముల్లంగిని తీసుకోకూడదు. అప్పటి వరకూ ఖాళీ కడుపుతో ఉన్నవారు ఒక్కసారిగా ముల్లంగిని తీసుకుంటే కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో కూడా ముల్లంగిని పక్కన పెట్టేయడం మంచిది. ఇతర ఏ ఆహారం తీసుకున్న తర్వాత అయినా ముల్లంగి పరాటాలను రాత్రి సమయం దాటిపోతున్న సమయంలో ముల్లంగి తినడం అంత మంచిది కాదు.
Updated Date - 2023-10-21T11:37:42+05:30 IST