Anti Aging Tips: రోజూ రాత్రిళ్లు పడుకునేముందు దీన్ని ముఖానికి రాసుకుని పడుకుంటే.. వయసు పెరుగుతున్నా..!
ABN, First Publish Date - 2023-10-09T15:26:31+05:30
ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖ్యంగా పొడి చర్మానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా మంచిది.
మామూలుగా ఇళ్ళల్లో పెరిగే.. కలబంద మొక్క గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. దీనిని ఇంటి ఆవరణలో పెంచుకోవడం శుభంగా భావిస్తారు. అలాగే సౌందర్యానికి కూడా కలబంద చాలా ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉంటారు. దీనితో చర్మం చాలా మృదువుగా, నిగారింపుతో తయారవుతుంది. అయితే దీనిని రాత్రి సమయంలో ముఖానికి రాయడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
కలబందను చర్మ సంరక్షణలో ఒకటి కాదు అనేక రకాలుగా చేర్చవచ్చు. ఇందులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు A, B, C, E అలాగే చర్మానికి మేలు చేసే అంశాలు ఉన్నాయి. కలబందను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. చర్మానికి యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అందుతాయి. ఇన్ని గుణాలున్న కలబందను రోజూ ముఖానికి సరిగ్గా రాసుకుంటే, చర్మానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అలోవెరా జెల్, తాజా కలబంద గుజ్జును రాత్రిపూట ముఖానికి ఎలా అప్లై చేయవచ్చు.
ఇది కూడా చదవండి: అలోవెరాను వాడే అలవాటుందా..? మంచిది కదా అని అతిగా వాడితే ఏం జరుగుతుందో తెలుసా..?
ముఖంపై కలబందను ఎలా అప్లై చేయాలి..
కలబందను ముఖంపై సాదాసీదాగా అప్లై చేయవచ్చు. ఇందుకోసం అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకుని వదిలేసి నిద్రపోవాలి. కలబందను రాత్రంతా ముఖంపై ఉంచకూడదనుకుంటే, 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవచ్చు.
కలబంద, రోజ్ వాటర్
అలోవెరా జెల్‌లో రోజ్ వాటర్ మిక్స్ చేసి రాత్రిపూట కూడా ముఖానికి రాసుకోవచ్చు. ఇది చర్మానికి నిగారింపును ఇవ్వడమే కాకుండా, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
అలోవెరా, ఆరెంజ్ పీల్
ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. అలోవెరా జెల్‌లో నారింజ తొక్కల పొడిని కలిపి ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖంపై 15 నుంచి 20 నిమిషాల పాటు అప్లై చేసి తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తూ ఉంటే.. చర్మం నిగారింపుతో కనిపిస్తుంది.
కలబంద, తేనె
ఈ ఫేస్ ప్యాక్‌ను రాత్రిపూట కూడా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్ చేయడానికి, అలోవెరా జెల్‌లో తేనె, కొద్దిగా పాలు మిక్స్ చేసి పేస్ట్‌ను తయారు చేయండి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖ్యంగా పొడి చర్మానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా మంచిది.
కలబంద, పసుపు
చర్మం కాంతివంతంగా ఉండాలంటే రాత్రిపూట కలబందలో చిటికెడు పసుపు వేసి రాసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి బాగా పట్టించాలి. ఇది రాత్రంతా ముఖంపై ఉంచుకోవచ్చు. తరచుగా ఇలా చేస్తుంటే చర్మంపై బంగారు గ్లో కనిపిస్తుంది.
Updated Date - 2023-10-09T15:26:31+05:30 IST