Sleep: నిద్ర సరిగా పోవడం లేదా..? అయితే ఈ 10 ప్రమాదకర పరిస్థితులు వెంటాడటం ఖాయం..!
ABN, First Publish Date - 2023-08-22T15:31:15+05:30
పని చేయని అనేక పద్ధతులను ప్రయత్నించిన తర్వాత, నిద్ర మందులు చివరి ప్రయత్నం కావాలి.
సుఖవంతమైన నిద్ర కావాలంటే ఒత్తిడి లేని జీవనశైలి ఉండాలి. ఇప్పటి రోజుల్లో ఒత్తిడితో కూడిన జీవన శైలితోనే ప్రతి ఒక్కరూ ఉంటున్నారు. కాబట్టి 18 దేశాలలో ఫిట్ బిట్ అనే సంస్థ చేసిన అధ్యయమం ప్రకారం, నిద్రలేమితో భారతీయులు రెండవ స్థానంలో ఉన్నారు. ఒక భారతీయుడు సగటున 7 గంటల 1 నిమిషం నిద్రపోతే, జపనీయులు మనకంటే 6 గంటల 41 నిమిషాల కంటే తక్కువ నిద్రపోతారు. ఈపరిస్థితిలో, చాలా వరకూ నిద్ర మందులు వాడుతున్నారు. మామూలుగా నిద్ర నాణ్యత, సమయం, విషయంలో సమస్యలున్నప్పుడు ఈ సమస్య మొదలవుతుంది, దీని ఫలితంగా పగటిపూట పనులకు ఆటంకాలతో పాటు, శరీర పనితీరు బలహీనమవుతుంది. నిద్ర విధానాలను మార్చడం వల్ల, శరీరంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. చాలా సందర్భాలలో స్లీప్ అప్నియా లేదా నిద్రలేమికి దారితీస్తుంది.
నాణ్యమైన నిద్ర
నిద్ర సరైన సమయంలో పట్టాలంటే రాత్రి పూట తేలికైన ఆహారం తీసుకుని రోజులో శరీరక శ్రమ బాగా చేసి ఉండాలి. లేదా.. చిన్నపాటి వ్యాయామానికి సాయంత్రం కాస్త సమయం కేటాయించినా కూడా నిద్ర దానంతట అదే పడుతుంది. అయితే గత్యంతరం లేని సమయంలో మాత్రమే నిద్రమాత్రలు చివరి ప్రయత్నంగా ఉండాలి. పని చేయని అనేక పద్ధతులను ప్రయత్నించిన తర్వాత, నిద్ర మందులు చివరి ప్రయత్నం కావాలి. నిద్రపోయే ముందు టీ, కాఫీ వంటి ఉత్ప్రేరకాలు తీసుకోవటం మానుకోవాలి. ధ్యానం నిద్రపోవడానికి సహాయపడుతుంది.
సరైన నిద్ర లేకపోతే దానివల్ల శరీరం పై ఎన్నో చెడు ప్రభావాలు ఉంటాయి. తక్కువ నిద్రపోవడం వల్ల 10 పెద్ద ప్రమాదాలు
1. అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.
2. గుండె జబ్బుల ముప్పు 48 శాతం పెరుగుతుంది.
3. తక్కువ నిద్ర మెదడు కణజాలంపై ప్రభావం చూపుతుంది.
4. స్ట్రోక్ ప్రమాదం నాలుగు రెట్లు పెరుగుతుంది.
5. మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: కేవలం 4 గంటల్లోనే గవద బిళ్లలను తగ్గించే చిట్కాలివీ.. ఈ 6 ట్రిక్స్‌లో ఏ ఒక్కటి పాటించినా..!
6. అధిక ఆకలి కారణంగా అతిగా తినడం ప్రమాదం.
7. పని ప్రదేశంలో ఉత్పాదకత తగ్గుతుంది.
8. రూపం, చర్మం చెడిపోతుంది.
9. చలి ప్రమాదం మూడు రెట్లు ఉంటుంది.
10. తలనొప్పి వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి.
Updated Date - 2023-08-22T15:31:15+05:30 IST