ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Curd: పెరుగు తినే అలవాటున్నా.. చాలా మందికి తెలియని నిజమిది.. చలికాలంలోనే ఇలా ఎందుకవుతుందంటే..!

ABN, First Publish Date - 2023-11-24T14:19:46+05:30

తోడుకోవడానికి కష్టంగా ఉంటే నిమ్మ ఆకో, ఎండుమిర్చినో వేసి తోడువేస్తూ ఉంటారు.

curd in casserole

పెరుగు భారతీయులకు భోజనంలో బాగా అలవాటైన పదార్థం. భోజనం అంతా చేసాకా చివర్లో కమ్మని పెరుగుతో భోజనం పూర్తిచేయకపోతే అసలు భోజనం తినని ఫీలింగ్ కలుగుతుంది కొందరికి. అయితే పెరుగును ఈ మధ్య కాలంలో ప్యాకెట్స్ రూపంలో వస్తున్నవి తీసుకుంటూ ఉన్నాం. అయితే సాంప్రదాయంగా ఇండ్లల్లో తోడు వేసుకుని తిన్న పెరుగు చాలా కమ్మని వాసనతో, కమ్మని రుచితో తినేందుకు ఇష్టంగా ఉంటుంది. ఈ పెరుగును శీతాకాలంలో ఎలా తోడు వేసకోవాలి. చల్లని ప్రదేశాల్లో పెరుగును ఎంతసమయం తోడు వేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.

పెరుగును ఇలా తయారు చేస్తున్నారా..

చలికాలంలో పెరుగు తోడుకోవడం అనేది కాస్త సమయం ఎక్కువగానే ఉంటుంది. పెరుగు చేయడం చాలా కష్టమైన పని ఈ కాలంలో. వాతావరణంలో పెరుగు నీళ్ళలా పలచగా, సరైన రుచి లేకుండా ఉంటుంది. అలా కనుక పెరుగు చేస్తే తినేందుకు ఇష్టంగా ఉండదు.

ఇది కూడా చదవండి: హెయిర్ డ్రయ్యర్స్‌తో దగ్గును తగ్గించొచ్చా..? సిరప్‌ల కంటే ఈ టెక్నిక్స్ వాడితే త్వరగా తగ్గిపోతుందా..?


చలికాలంలో పెరుగు ఎందుకు గడ్డకట్టదు.

ఈ సీజన్ లో తక్కువ ఉష్ణోగ్రత కారణంగా పెరుగు సరిగా తోడుకోదు. శీతాకాలంలో పెరుగుతోడుకోవడానికి 12 గంటల సమయం తీసుకుంటుంది. అదీ కాస్త వెచ్చని పాలలో మాత్రమే తోడు కలిపితే వెచ్చని ప్రదేశంలో ఉంచితే ఇది త్వరగా పేరుకుంటుంది.

పెరుగు తోడుకోవడానికి సులువైన మార్గం..

మరీ తోడుకోవడానికి కష్టంగా ఉంటే నిమ్మ ఆకో, ఎండుమిర్చినో వేసి తోడువేస్తూ ఉంటారు. కాస్త దలసరి గిన్నెలో పాలను గోరువెచ్చగా వేసి, తోడు కూడా కొత్తగా కాస్త తాజాగా ఉన్న పెరుగును కొలతగా కొద్దిగా మాత్రమే పాలలో వేసి, బాగా కలిపి చిల్లులు ఉన్న మూతను పాత్రమీద పెట్టాలి. ఇలా చేయడం వల్ల పాల గిన్నెలోకి గాలి చొరబడి బయటకు సులువుగా వచ్చేందుకు మార్గం ఉంటుంది. ఎలాంటి వాసనలు వేయకుండా కమ్మగా మాత్రమే ఉంటుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-24T14:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising