Sleeping On The Floor: ఇంట్లో ఫ్లోర్ మీద పడుకునే అలవాటుందా..? వీళ్లు మాత్రం అస్సలు అలా పడుకోకండి.. ఎందుకంటే..
ABN, First Publish Date - 2023-03-27T15:19:30+05:30
వెన్నెముక రుగ్మతలు ఉన్నవారు నేలపై పడుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
నేలపై పడుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుందని, భంగిమను మెరుగుపరుచుకోవచ్చని, వెన్నునొప్పిని తగ్గించవచ్చని సాధారణంగా నమ్ముతారు. అయితే, ఇది శాస్త్రీయంగా చెల్లుతుందా? చాలామంది మంచం మీద కాకుండా నేలపై పడుకోవడం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే, నేలపై పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఇంకా పరిశోధనలు జరగలేదు.
నేలపై పడుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా?
1. వెన్నునొప్పిరావచ్చు.
చాలా మంది వ్యక్తులు నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి తగ్గిపోతుందని అంటుంటారు. అయితే అలా చేయడం వల్ల చాలా తక్కువగా ఫలితాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫ్లోర్ స్లీపింగ్ మంచిదని అనేవారు ఇది వెన్నునొప్పిని తగ్గించి, మరింత ప్రశాంతమైన రాత్రి నిద్రకు దారితీస్తుందని పేర్కొన్నారు. Medium firm mattresses నిద్ర సౌకర్యాన్ని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయని, వెన్నెముక అమరికను మెరుగుపరుస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
2. భంగిమను మెరుగుపరచవచ్చు.
నేల తీరు, నిద్ర భంగిమను బట్టి కూడా ఫలితాలుంటాయని ఆధారాలు సూచిస్తున్నాయి. నేలమీద పడుకోవడం వల్ల వెన్నెముకకు ఇబ్బంది కలుగవచ్చు. స్కోలియోసిస్ లేదా కైఫోసిస్ వంటి వెన్నెముక రుగ్మతలు ఉన్నవారు నేలపై పడుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
ఇది కూడా చదవండి:
ఆడవాళ్లలో ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుందని చాలామంది నమ్ముతారు, అయినప్పటికీ అధ్యయనాలు దీనిని నిరూపించలేదు. దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఫ్లోర్ స్లీపింగ్ అనువైనది కాకపోవచ్చు.
Updated Date - 2023-03-27T18:30:10+05:30 IST