Yello Teeth: పళ్లు పచ్చగా అవడం మొదలైందా..? మెడిసిన్స్ అక్కర్లేదు.. ఈ చిట్కాతో ముత్యాల్లా మెరవడం ఖాయం..!
ABN, First Publish Date - 2023-08-19T14:03:29+05:30
పేస్ట్ తో కన్నా వేపపుల్లతో దంతాలను బ్రష్ చేయడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అందమైన రూపానికి చిరునవ్వు మరింత అందాన్ని తెస్తుంది. అలాంటి నవ్వుకు ప్రాణం పోసేది దంతాలే. అవి మిల మిల మెరుస్తూ తెల్లగా కనపిస్తే.. ఆ నవ్వుకు వెలకట్టగలమా.. కానీ దంతాలు పచ్చగా రంగుమారితే మాత్రం అస్సలు అందంగా ఉండదు. దీనికి చాలా కారణాలున్నాయి. చెడు ఆహారపు అలవాట్లతో దంతాల అందం చెడిపోతుంది. వీటిని తిరిగి అందంగా మార్చాలంటే చాలా డబ్బుతో కూడుకున్నపని. అయితే అసలు దంతాలను తెల్లాగా మార్చడానికి వేరే మార్గాలేం లేవా అంటే ఇంట్లోనే చిన్న చిట్కాతో దంతాలను తెల్లగా మారేట్టు చేయచ్చట.. అదెలాగంటే.
1. దంతాలు పసుపు రంగులో ఉంటే, కొబ్బరి నూనెను వాడటం వల్ల కొంత సమయం పాటు ఉంచి రుద్దాలి.. ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. రాత్రిపూట దంతాల మీద నారింజ తొక్కను కూడా రుద్దవచ్చు. దీంతో నోటి దుర్వాసన పోయి దంతాలపైన పేరుకున్న మురికి తొలగిపోతుంది.
2. ఒక టీస్పూన్ ఉప్పులో నిమ్మరసం, ఆవనూనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ తో 3 రోజులు బ్రష్ చేయడం వల్ల దంతాలపై పసుపు పొరను చాలా వరకు తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: బాన పొట్టను యమా ఈజీగా కరిగించాలనుకుంటున్నారా..? ఒక్కసారి దీన్ని ట్రై చేయండి..!
3. మనందరికీ తెలిసిన, పూర్వం దంతాలను శుభ్రపరిచేందుకు ప్రతిఒక్కరూ వాడిన, వేప మన దంతాల పసుపు రంగును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. పేస్ట్ తో కన్నా వేపపుల్లతో దంతాలను బ్రష్ చేయడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
4. అంతే కాకుండా పసుపు పళ్లను పోగొట్టడానికి, స్ట్రాబెర్రీ, ఉప్పును కలిపి మెత్తగా చేసి, బ్రష్ సహాయంతో దంతాలను శుభ్రం చేస్తే, దంతాలు తెల్లగా మెరుస్తాయి.
5. వేప పళ్ళు కూడా దంతాల పసుపు రంగును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
Updated Date - 2023-08-19T14:03:29+05:30 IST