Inhabitants Sick: మీ ఇంట్లో వాళ్లు తరచూ రోగాల బారిన పడుతున్నారా.. అయితే అందుకు కారణం మరేదో కాదు..
ABN, First Publish Date - 2023-02-23T13:33:24+05:30
వాటిని వదిలించుకోవడం సాధ్యం కాకపోయినా, కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు.
ఓ పాత ఆంగ్ల సామెత ఉంది, "మీ సంకల్ప శక్తి కంటే మీ వాతావరణం చాలా శక్తివంతమైనది". ఈ మాట వాస్తుకు అన్నింటికంటే ఎక్కువగా వర్తిస్తుంది. జీవితంలో సగానికి పైగా గడిపే మీ ఇల్లు మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వాస్తును సరిగా పాటించకుండా చేసే చిన్న చిన్న తప్పులకు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నారు వాస్తు నిపుణులు.
వంటగది మీ ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది:
నైరుతిలో వంటగది వల్ల కాళ్లలో నొప్పులు, ఇంట్లోని మహిళలకు స్త్రీ జననేంద్రియ సమస్యలు వస్తాయి. తూర్పు, ఆగ్నేయ దిశల మధ్య వంటగది కుటుంబంలోని ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులకు ఊబకాయాన్ని కలిగిస్తుందట.
రంగులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి:
ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో రంగులు మరొక ముఖ్యమైన అంశం. ఈశాన్యంలో ఎరుపు లేదా ఊదా రంగు తలనొప్పికి కారణమవుతుంది. కుటుంబంలోని వారికి మైగ్రేన్ వస్తుందట.
వస్తువులను ఉంచే స్థానం కూడా ముఖ్యమైనది:
వస్తువులను ఉంచే స్థానాల వల్ల కూడా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందట. ఇంటి మధ్యలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ డిప్రెషన్ వ్యసనాలకు కారణమవుతుంది. తూర్పు, ఆగ్నేయానికి మధ్య ఉన్న డస్ట్‌బిన్ వల్ల కాలేయ సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది.
తేమ కూడా మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది:
ఇంట్లో నీళ్ళు కారడం, మచ్చల వల్ల ఇంట్లో వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన కారకాల్లో ఒకటి. గోడలలో తేమ, ఊట గోడలు, పైకప్పులలో పగుళ్లు అత్యంత హాని కలిగించే ఆరోగ్య సమస్యలకు కారణాలు.ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే, అప్రమత్తంగా ఉండాలి.
ఎలక్ట్రానిక్స్ ఆఫ్ చేయాలి:
ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, పరికరాలకు బాగా అలవాటు పడినప్పటికీ, అవి విడుదల చేసే EMF రేడియేషన్‌ల ప్రభావం ఒత్తిడి గురించి మనలో కొద్దిమందికి మాత్రమే తెలుసు. వాటిని వదిలించుకోవడం సాధ్యం కాకపోయినా, కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు: నిద్రిస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను బెడ్‌రూమ్‌లో కనీసం ఏడు అడుగుల దూరంలో ఉంచండి, బెడ్‌రూమ్‌లో వై-ఫై రూటర్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దు లేదా వాటిని స్విచ్ ఆఫ్ చేయాలి.
Updated Date - 2023-02-23T13:33:27+05:30 IST