ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gowri Deepa : మిలటరీ స్కూల్లో.. మేము సైతం

ABN, First Publish Date - 2023-03-08T00:12:25+05:30

భారత అమృతోత్సవాల వేళ... తొలిసారిగా రాష్ర్టీయ మిలటరీ స్కూళ్ళలో బాలికలు అడుగుపెట్టారు. దేశ రక్షణలో అహర్నిశలూ నిమగ్నమైన సైనికుల పిల్లల కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భారత అమృతోత్సవాల వేళ... తొలిసారిగా రాష్ర్టీయ మిలటరీ స్కూళ్ళలో బాలికలు అడుగుపెట్టారు. దేశ రక్షణలో అహర్నిశలూ నిమగ్నమైన సైనికుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన పాఠశాలలు కావడం వీటి ప్రత్యేకత. వీటిలో చదివేందుకు దేశవ్యాప్తంగా ఎంపికైన 30 మంది బాలికల్లో ఒక తెలుగు అమ్మాయి కూడా ఉంది.

రాష్ట్రీయ మిలటరీ స్కూళ్ళు... దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ, ఎక్కువ కాలం కుటుంబాలకు దూరంగా ఉంటున్న సైనికుల పిల్లల విద్యాభ్యాసం సక్రమంగా కొనసాగడం లేదన్న భావనతో... వీటిని 1940వ దశకం ద్వితీయార్థంలో అప్పటి బ్రిటిష్‌ పాలకులు ఆరంభించారు. దక్షిణ భారతీయుల కోసం 1945లో కర్ణాటకలోని బెళగావిలో ఒక రాష్ట్రీయ మిలటరీ స్కూల్‌, 1946లో బెంగళూరులో కింగ్‌ జార్జ్‌ రాయల్‌ ఇండియన్‌ మిలటరీ కాలేజ్‌ ఏర్పాటయ్యాయి. వీటితోపాటు హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఛైల్‌, రాజస్థాన్‌లోని అజ్మీర్‌, ధోల్‌పూర్‌లతో కలిపి... దేశంలో అయిదు ప్రాంతాల్లో మాత్రమే రాష్ట్రీయ మిలటరీ స్కూళ్ళు ఉన్నాయి. దాదాపు ఏడున్నర దశాబ్దాలకు పైగా వీటిలో ప్రవేశం బాలురికి మాత్రమే పరిమితం. అయితే మహిళలకు అన్ని రంగాలలో భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో... భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం వల్ల బాలికలు రాష్ట్రీయ మిలటరీ స్కూళ్ళలో చేరే అవకాశం లభించింది. వారి కోసం 30 సీట్లు కేటాయించారు. రాష్ట్రీయ మిలటరీ స్కూళ్ళలో ఏటా 6, 9వ తరగతులలో విద్యార్థులకు ప్రవేశాలకు డిసెంబరు నెలలో పరీక్షలు జరుపుతారు. ప్రతి తరగతికి 60 మందిని ఎంపిక చేస్తారు. ఇవన్నీ జనరల్‌ కేటగిరీలోనే ఉంటాయి. సీట్లలో సైనికుల పిల్లలకు 70 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగిలిన 30 శాతం సీట్లు సాధారణ కోటాలో ఉంటాయి. ఎంపికైన వారికి 12వ తరగతి వరకూ చదువుతో పాటు సైనిక శిక్షణ ఇస్తారు. చదువుతో పాటు... సైన్యంలో ఎంపికైన వారికి ఇచ్చే తరహా శిక్షణలు నిరంతరం కొనసాగుతాయి. అలాగే మార్చ్‌ఫాస్ట్‌, డ్రిల్‌, ఇతర క్రీడలు, వ్యక్తిగత నైపుణ్యతలు, ఆయుధాల్ని ఉపయోగించడం లాంటి వాటిలోనూ ఉంటుంది.

నాన్న స్ఫూర్తితో...

‘‘కడప జిల్లా ఎర్రగుంటలోనూ, నాన్న సైనికుడిగా పనిచేసిన పలు ప్రాంతాల్లోనూ చదివాను. కానీ మిలటరీ స్కూల్‌లో వాతావరణం చాలా బాగుంది. సాధారణ పాఠశాలలతో దీన్ని పోల్చలేం. తరగతులతో పాటు నెలవారీ కార్యక్రమాలు ఉంటాయి. బాలురితో పాటు అన్ని అంశాల్లో పాల్గొంటున్నాం. ఉపాధ్యాయులు, ఇతరత్రా శిక్షకులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఈ స్కూల్‌లో చేరాక తొలిసారి మా సొంతూరు వెళ్ళాను. అక్కడ నా పాత సహ-విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక అభిమానం చూపారు. మా బంధువులు ప్రోత్సహించేలా మాట్లాడారు. మా నాన్న నాకు స్ఫూర్తి. ఆయనలా క్రమశిక్షణతో మెలుగుతూ... ఉత్తమంగా రాణించాలని అనుకుంటున్నా. మా అమ్మ గృహిణి. నా చెల్లెలు హరిప్రియ నాలుగో తరగతి చదువుతోంది.’’

- ఓబుళాపురం గౌరీ దీప

ఆరు నెలల్లోనే ఎంతో నైపుణ్యం

2021 డిసెంబర్‌లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు తొలిసారిగా బాలికలకు అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా 36 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు సుమారు 58 వేలమంది బాలబాలికలు హాజరయ్యారు. బెంగళూరు కేంద్రాల్లో 1,500 మంది బాలికలు పోటీపడ్డారు. సీట్ల సంఖ్య పరిమితం కాబట్టి ఎంపిక విధానం కూడా కఠినంగానే ఉంటుంది. ఓఎంఆర్‌ విధానంలో 100 మార్కులకు పరీక్ష పెడతారు. ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి. మిలటరీ కమాండ్‌ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు జరిపి, ఫిట్‌నె్‌సకు మార్కులు జోడిస్తారు. అత్యధిక మార్కులు సాధించినవారికి... వారు చేరాల్సిన పాఠశాలలను ఖరారు చేస్తారు. ఆ విధంగా ఎంపికై... బెంగళూరు రాష్ట్రీయ మిలటరీ స్కూల్‌లో ఆరవ తరగతిలో సీటు సంపాదించుకున్న ఆరుగురు బాలికల్లో... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడప జిల్లా ఎర్రగుంటకు చెందిన ఓబుళాపురం గౌరీ దీపతో పాటు హర్షి వి.పటేల్‌ (గుజరాత్‌), వర్ష యాదవ్‌ (హరియాణా), అదితి నెహ్రా (ఉత్తరప్రదేశ్‌), దిల్జన్‌కౌర్‌ (పంజాబ్‌), సిమ్రాన్‌ ఫరీదాలు (ఒడిశా) ఉన్నారు. వీరు 2022 ఆగస్టులో ఆ స్కూల్‌లో చేరారు. ‘‘ఈ ఆర ు నెలల వ్యవఽధిలో ఎంతో నైపుణ్యం సాధించాం’’ అంటున్నారీ అమ్మాయిలు. ‘‘మా నాన్న సైన్యంలో ఉన్నారు. ఆయన క్రమశిక్షణ... సొంతూరుకు వస్తే బంధువులు, గ్రామస్తులు సైనికుల పట్ల చూపే అభిమానం, ఇచ్చే గౌరవాన్ని చూశాను. అందుకే సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాను. అందుకు తగినట్టుగానే మిలిటరీ స్కూల్‌లో చదువుకునే అవకాశం వచ్చింది, మరువలేని సంతోషాన్ని ఇచ్చింది’’ అంటోంది గౌరీ దీప. ‘‘మా తాత ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసేవారు. దేశానికి సేవ చేయాలనే ఆయన ఆశయం నిలబెట్టడానికి... సైన్యంలో చేరతానని చిన్నప్పటి నుంచీ ఇంట్లో అనేదాన్ని. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మిలటరీ స్కూల్‌లో చోటు లభించడం ఆనందంగా ఉంది’’ అని చెబుతోంది హర్షి పటేల్‌.

హిందూపురం రవి, బెంగళూరు

Updated Date - 2023-03-08T02:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising