ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fashion : రాజస్థానీ హంగుల్లో...

ABN, First Publish Date - 2023-11-21T23:00:40+05:30

రాజస్థానీ చీరలు మనోహరమైన రంగులతో ఆకట్టుకుంటాయి. పట్టు, సింథటిక్‌... కలబోతతో, అందమైన అద్దకాలతో అతివల అందాలను రెండింతలు చేసే ఈ చీరలు

రాజస్థానీ చీరలు మనోహరమైన రంగులతో ఆకట్టుకుంటాయి. పట్టు, సింథటిక్‌... కలబోతతో, అందమైన అద్దకాలతో అతివల అందాలను రెండింతలు చేసే ఈ చీరలు ప్రతి వార్డ్‌రోబ్‌లో కచ్చితంగా ఉండాల్సిందే!

  • జరీ అంచు ధగధగలతో మెరిసిపోయే చీరకు, మ్యాచింగ్‌ బ్లౌజు కూడా జరీదే ఉండడం ఈ చీర ప్రత్యేకత. నారింజ, ఎరుపు ముదురు రంగుల్లో ఫేడెడ్‌ డిజైన్‌ కలిగి ఉండే ఈ చీర కట్టుకుంటే ముద్దబంతి పువ్వులా వెలిగిపోవడం ఖాయం!

  • లంగా, ఓణీ డిజైన్‌తో ఉన్న రాజస్థానీ చీర ఎలాంటి వయసువారికైనా నప్పుతుంది. ప్లెయిన్‌ కలర్‌ చీరకు, భారీ డిజైన్‌ ఉన్న పవిట కొంగును ఎంచుకోవాలి.

  • అద్దకాలతో అదరగొట్టే చీరకు కాంట్రాస్ట్‌ కలర్స్‌ అదనపు ఆకర్షణ. పసుపు, కుంకుమల మేళవింపులా కనిపించే ఈ తరహా చీరలను వేడుకల్లో ధరిస్తే అందరి దృష్టీ మీ వైపే!

  • చీర మొత్తం తెలుపు రంగు అద్దకాలతో వెలిగిపోయే చీరీలకు రెండు వైపులా జరీ అంచులుంటే అదనపు అందం సమకూరుతుంది. ఆ అంచుకు తగ్గట్టు అదే మోడల్‌ బ్లౌజ్‌ వేసుకుంటే అందమే అందం!

  • భారీ బార్డర్‌తో ఏ చీరకు అందం రాదు? సెక్విన్‌ వర్క్‌తో హెవీ లుక్‌ తెచ్చుకున్న రాజస్థానీ చీరలు కడితే వేడుకల్లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలవడం ఖాయం!

Updated Date - 2023-11-21T23:00:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising