Foods For Your Dog: ఈ వేసవిలో కుక్కలకు హీట్ స్ట్రోక్ తగలకూడదంటే.. ఇలా చేయండి..!
ABN, First Publish Date - 2023-03-16T10:13:42+05:30
విటమిన్‌లతో పాటు మంచి రుచిని అందించే విషయంలో మామిడి పండ్లు ముందుంటాయి.
కుక్కల కోసం 6 శీతలీకరణ ఆహారాలు..
వేసవి కాలం వచ్చిందంటే మనకే.. ఎయిర్ కండిషనింగ్, శీతలీకరణ ఆహారాలు లేకుండా ఉండడం దాదాపు అసాధ్యం. అలాంటిది పెంపుడు జంతువులు కూడా వేసవిలో ఆహారం విషయంలో కాసిని జాగ్రత్తలు అవసరం. ఈ సమయంలోనే అవి అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. కనుక ఆహారంలో మార్పు అవసరం. వాటికి ఇచ్చే ఆహారంలో హైడ్రేటింగ్ ఆహారాలను అందించడం చాలా ముఖ్యం, దీనివల్ల వాటి శరీరం చల్లగా ఉంటుంది.
అలాగే ఉదయాన్నే నడకకు తీసుకువెళ్ళాలి., ఎందుకంటే వేసవి వేడి అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతుంది. అదే కుక్కకు శ్వాసక్రియ రేటు పెరిగి ఉంటే, చిగుళ్లు పొడిగా లేదా జిగటగా ఉంటే, చిగుళ్లలో గాయాలు, నీరసంగా లేదా అయోమయ స్థితిలో ఉంటే, వాటికి హీట్ స్ట్రోక్‌తో బాధపడుతున్నట్టు లెక్క. కాబట్టి వెంటనే వైద్య సహాయం అందించడం చాలా ముఖ్యం. పెంపుడు జంతువులకు వేసవిని చల్లగా , సౌకర్యవంతంగా ఉంచడం చాలా సులభం. సరైన ఆహారంలో మార్పులు, ఈ వేసవిలో కుక్కలు తినగలిగే శీతలీకరణ ఆహారాలు ఇవి.
పుచ్చకాయలు
వేసవి నెలల్లో పెంపుడు జంతువులు తినడానికి పుచ్చకాయలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పుచ్చకాయ పెంపుడు జంతువులకు హైడ్రేషన్ అందేలా చేస్తుంది. పుచ్చకాయలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. అయినప్పటికీ, జంతువుకు ఆహారంగా ఇచ్చే ముందు పుచ్చకాయ విత్తనాలను తీసివేసి ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి పెంపుడు జంతువులకు హానికరం.
ఇది కూడా చదవండి: ఈ దిక్కులో తమలపాకు తీగను పెంచారంటే.. డబ్బే డబ్బు..!
దోసకాయ
దోసకాయలో B1, B7, C, K వంటి విటమిన్లు, రాగి, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి పెంపుడు జంతువు ప్రేగు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దోసకాయలలోని అధిక మొత్తంలో నీరు పెంపుడు జంతువు వేసవి ఆహారంలో సంపూర్ణ భాగంగా చేస్తుంది, ఎందుకంటే కుక్కలు ఈ వేసవిలో నీరు త్రాగడానికి ఆసక్తి చూపకపోయినపుడు వాటికి అవసరమైన hydrationను అందించడంలో సహాయపడతాయి.
మామిడికాయలు
A, B6, C, E అవసరమైన యాంటీఆక్సిడెంట్లు వంటి విటమిన్‌లతో పాటు మంచి రుచిని అందించే విషయంలో మామిడి పండ్లు ముందుంటాయి. ఈ వేడి వాతావరణంలో కుక్కలకు ఆరోగ్యకరమైన, రుచికరమైన ట్రీట్ కావచ్చు. ఈ పండును ఇచ్చే ముందు పై తొక్క , విత్తనాన్ని తీసి ఇవ్వాలని గుర్తుంచుకోండి.
తడి గ్రేవీస్
రుచిగా, మరింత హైడ్రేటింగ్‌గా ఉండటానికి భోజనంలో గ్రేవీ ఫుడ్‌ను చేర్చడం మంచిది. గ్రేవీ ఫుడ్స్ చాలా ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి, కుక్కలకు వేడిని ఎదుర్కోవడానికి, చల్లగా ఉంచడానికి ఆహారంలో ఇవ్వడం మంచిది.
Updated Date - 2023-03-16T10:13:42+05:30 IST