Redmi Buds: దేశీ మార్కెట్‌లోకి రెడ్‌మీ బడ్స్
ABN, First Publish Date - 2023-06-10T00:50:44+05:30
రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్ ఈ నెల 13న మన మార్కెట్‌లోకి వస్తున్నాయి. బాస్ కోసం ‘ప్రొ డ్రైవర్స్’, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ కాన్సిలేషన్(ఈఎన్‌సీ), గూగుల్ ఫాస్ట్ పెయిర్ టెక్నాలజీతో వస్తోంది. తెలుపు, నలుపు రంగుల్లో ఇది లభిస్తుంది.

షావోమీ ప్యాడ్, ఆండ్రాయిడ్ టాబ్లెట్
షావోమీ ప్యాడ్ 6, ఆండ్రాయిడ్ టాబ్లెట్ కూడా అదే రోజు విడుదల అవుతున్నాయి. గేమ్ చేంజింగ్ ఫీచర్స్ ఇందులో ఉంటాయి. తద్వారా ఉత్పాదకతను మరో స్థాయికి తీసుకెళ్ళాలని కంపెనీ భావిస్తోంది. టీజర్ ప్రకారం చూస్తే షావోమీ ప్యాడ్ 8 గ్రే, బ్లూ రంగుల్లో లభించనుంది. స్టయిలస్ సపోర్ట్‌కు తోడు కీబోర్డ్‌తో ఆండ్రాయిడ్ టాబ్లెట్ విడుదల అవుతోంది. ప్యాడ్ విషయానికి వస్తే, 11 ఇంచీల డిస్‌ప్లేకు తోడు 2880 ్ఠ 1800 పిక్సెల్ రిజల్యూషన్ ఉంది. 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రష్ రేటు ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. 13 ఎంపీ రేర్ కెమెరా ఉంది. 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్, సెల్ఫీస్ కోసం అమర్చారు. 8,840 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఆండ్రాయిడ్ టాబ్లెట్ - ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ఎస్‌ఓసీతో లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 126 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. నాలుగు స్పీకర్లు, నాలుగు మైక్రోఫోన్లు ఉన్నాయి.
Updated Date - 2023-06-10T00:50:44+05:30 IST