ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IQ Neo 7 : దేశీ మార్కెట్లోకి ఐక్యూ నియో 7

ABN, First Publish Date - 2023-02-18T00:08:40+05:30

ఐక్యూ నియో 7 ఇండియన్‌ మార్కెట్లోకి వచ్చేసింది. గత ఏడాది విడుదల చేసిన ఐక్యూ నియో 6 మాదిరిగానే ఉంది. బరువు 193 గ్రాములు. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీకి తోడు 120 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టు ఉంది. మీడియాటెక్‌కు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐక్యూ నియో 7 ఇండియన్‌ మార్కెట్లోకి వచ్చేసింది. గత ఏడాది విడుదల చేసిన ఐక్యూ నియో 6 మాదిరిగానే ఉంది. బరువు 193 గ్రాములు. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీకి తోడు 120 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టు ఉంది. మీడియాటెక్‌కు చెందిన అప్‌గ్రేడ్‌ చేసిన ఎస్‌ఓసి ఉంది. ఇంటర్‌స్టెల్లార్‌ బ్లాక్‌, ఫ్రాస్ట్‌ బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యమవుతోంది. డిస్‌ప్లే నియో 6లో 6.6 ఇంచీలు కాగా ఇందులో అది 6.7గా ఉంది. పుల్‌ హెచ్‌డీ, 2400 ్ఠ 1080 పిక్సెల్‌, 120హెచ్‌జెడ్‌ రిఫ్రష్‌ రేటు, టచ్‌ శాంప్లింగ్‌ రేటు 300హెచ్‌ ఉన్నాయి. గేమింగ్‌, డూడ్లింగ్‌(బొమ్మలు, ప్యాట్రన్స్‌ గీయడం)కు ఈ ఫోన్‌ బాగా ఉంటుంది. డిస్‌ప్లేకు సంబంధించి హెచ్‌డీఆర్‌ 10+ సర్టిఫికేషన్‌, బ్లూ లైట్‌ సర్టిఫికేషన్‌ ఉన్నాయి. ఆటల సమయంలో వేడెక్కిన ఫోన్‌కు కూలింగ్‌ కోసం అతి పెద్ద వేపర్‌ చాంబర్‌, మల్టీ లేయర్‌ గ్రాఫైట్‌ షీట్స్‌ ఉన్నాయి. రేర్‌ కెమెరా సిస్టమ్‌కు తోడు ఓఐఎస్‌తో 64 మెగాపిక్సల్‌ ప్రైమరీ కెమెరా, మంచి ఇమేజ్‌ల కోసం కొత్త సెన్సర్‌ కూడా ఉన్నాయి. 5జీ బ్యాండ్‌ సపోర్ట్‌, ఎస్‌ఐఎం, బ్లూటూత్‌ 5.3, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, అండర్‌-డిస్‌ప్లే ఫింగర్‌ఫ్రింట్‌ స్కానర్‌ కూడా ఉన్నాయి. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ ఫోన్‌ ధర రూ.29,999 కాగా 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజీ ఫోన్‌ రేటు రూ.33,999. ఎంపిక చేసిన బ్యాంకులు రూ.1500 వరకు డిస్కౌంట్‌ ప్రకటించాయి.

Updated Date - 2023-02-18T00:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising