White Head: తల తెల్లబడుతోందా?

ABN, First Publish Date - 2023-03-20T22:27:17+05:30

కొందరిని బాల నెరుపు వేధిస్తుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించాలి.

White Head: తల తెల్లబడుతోందా?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చిట్కాలు

కొందరిని బాల నెరుపు వేధిస్తుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలు

పాటించాలి.

ఉసిరి నూనె:

ఉసిరి నాన బెట్టిన కొబ్బరినూనెతో వెంట్రుకల కుదుళ్లను మర్దించి, 45 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.

టీ డికాక్షన్‌:

టీ డికాక్షన్‌ను తలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి.

కరివేపాకు:

కొబ్బరినూనెలో కరివేపాకు వేసి మరిగించి, చల్లారిన తర్వాత తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.

ఆముదం, ఆవ నూనె:

ఈ రెండు నూనెలనూ కలిపి తలకు పట్టించి 45 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.

హెన్నా:

హెన్నా, కాఫీ హెయిర్‌ ప్యాక్‌ను జుట్టుకు పట్టించి 3 లేదా నాలుగు గంటల పాటు వదిలేసి, తర్వాత తలస్నానం చేయాలి.

బీర, కొబ్బరినూనె:

కొబ్బరినూనెలో బీరకాయ ముక్కలు వేసి మరిగించి, చల్లారాక తలకు పట్టించి, 45 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.

మందారం:

ఉసిరి, మందారాలను గుజ్జుగా చేసి, తలకు పట్టించి, 45 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి.

Updated Date - 2023-03-20T22:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising