Ironing: కరెంట్ బిల్లు తగ్గించే సూపర్ ఐడియా.. దుస్తులను ఇస్త్రీ చేయాలంటే ఐరన్ బాక్సులు అక్కర్లేదండోయ్.. ఈ టిప్స్ పాటిస్తే..!
ABN, First Publish Date - 2023-07-14T16:40:13+05:30
ముడతలు పోయి డ్రస్ చక్కగా ఐరన్ అయినట్టు కనిపిస్తుంది.
వర్షాకాలం దుస్తులు త్వరగా ఆరడం కష్టం. అలాగని దుస్తులు ఇస్త్రీకి ఇవ్వడం కూడా తక్కువ ఖర్చేం కాదు. పోనీ ఇంట్లోనే ఐరన్ బాక్స్ మీద ఇస్త్రీ చేయాలన్నా మానేస్తేనే నయం అనుకుంటారు. నిజానికి ఇస్త్రీ చేయాల్సి వస్తే అది కాటన్ వాటికే అవసరం అవుతుంది. మడతలు పడి వేసుకోడానికి ఇబ్బందిగా మారేది కాటన్ దుస్తులే. దీనివల్ల వెంటనే దుస్తులు వేసుకుని ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఐరన్, కరెంటు లేకుండా ఐరెన్ చేయడానికి సులభమైన మార్గాన్నితెలుసుకుందాం.
వెనిగర్ తో బట్టలు మడతలు నిఠారుగా అవుతాయని మీకు తెలుసా.. ఇది నిజమే ఈ ట్రిక్ పాటించి చూడండి. దుస్తులపై ముడుతలను తొలగించడానికి వంటలో ఉపయోగించే వెనిగర్‌ను ఉపయోగించవచ్చు.
దీని కోసం, స్ప్రే బాటిల్‌లో సమాన పరిమాణంలో నీరు, వెనిగర్ , హెయిర్ కండీషనర్ కలపండి. ఇప్పుడు దుస్తులను నిటారుగా ఉంచి దానిపై స్ప్రే చేయండి. తర్వాత ఫాబ్రిక్‌ను హ్యాంగర్‌పై వేలాడదీయండి. మరోసారి స్ప్రే చేసి ఆరనివ్వండి. బట్టలు ఆరిపోయిన వెంటనే ముడతలు పూర్తిగా మాయమైనట్లు గమనించవచ్చు.
తడి టవల్ తో నొక్కండి.
ఇది వినడానికి ఈ పద్ధతి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ నిజానికి దుస్తుల నుండి మడతలను తొలగించడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుంది.
దీని కోసం, టవల్‌ను నీటిలో తడిపి బాగా పిండి వేయండి. ఇప్పుడు ప్రెస్ కోసం టేబుల్‌పై డ్రస్ ను సరిగ్గా సర్దండి. తర్వాత తడి టవల్ తో డ్రస్ మడతలను బాగా నొక్కాలి. చివరగా, ఒక హ్యాంగర్‌పై ఆరబెట్టడానికి వేలాడదీయండి, ఇది చాలా వరకూ ముడతలను తీసివేస్తుంది.
ఇది కూడా చదవండి: రోజూ పొద్దునే చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇదే.. రాత్రిళ్లు ఈ గింజలను కనుక ఇలా వాడితే..!
కేటిల్ వేడి చేయడం ద్వారా దుస్తులను ఐరన్ చేయండి.
దీని కోసం, ఒక ఫ్లాట్ బాటమ్ పాత్రలో నీటిని నింపి గ్యాస్ మీద వేడి చేయండి. తర్వాత దాన్ని డ్రస్ పై నెమ్మదిగా కదిలించాలి. ముడతలు పోయి డ్రస్ చక్కగా ఐరన్ అయినట్టు కనిపిస్తుంది.
బరువైన పరుపుల కింద దుస్తుల్ని ఉంచినప్పుడు ముడతలు తొలగిపోతాయి. దీని కోసం, బట్టలు ఉతికి, ఎండబెట్టిన తర్వాత, వాటిని మడతపెట్టి, 2 నుంచి 3 గంటల పాటు mattress కింద ఉంచండి. ఇలా చేయడం వల్ల దుస్తులు చాలా వరకు మడతలు లేకుండా కనిపిస్తాయి.
Updated Date - 2023-07-14T16:40:13+05:30 IST