జూన్ 1న మోటారోలా నుంచి పెద్ద ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్
ABN, First Publish Date - 2023-05-20T03:25:32+05:30
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు ప్రస్తు తం పలువుర్ని అలరిస్తున్నాయి. ఈ సెగ్మంట్‌లో శాంసంగ్ ఇప్పటికి రాజ్యం ఏలుతోంది. ఒప్పో, టెక్నో సైతం రంగప్రవేశం చేశాయి. తాజాగా లెనోవాకు చెందిన మోటారోలా తాజాగా తదుపరి జనరేషన్ ఫోల్డబుల్
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు ప్రస్తు తం పలువుర్ని అలరిస్తున్నాయి. ఈ సెగ్మంట్‌లో శాంసంగ్ ఇప్పటికి రాజ్యం ఏలుతోంది. ఒప్పో, టెక్నో సైతం రంగప్రవేశం చేశాయి. తాజాగా లెనోవాకు చెందిన మోటారోలా తాజాగా తదుపరి జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను జూన్1న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఫ్లిప్ ద స్క్రిప్ట్ పేరిట ఆ రోజున ఒక ఈవెంట్‌ను కూడా మోటరోలా ప్లాన్ చేసింది. ఆ రోజు మొదట అమెరికాకు అవి చేరుకుంటాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ను పక్కనపెడితే, 9టు5 గూగుల్ ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ రేటు అధికం. మూడు వేర్వేరు రంగుల్లో వస్తున్నాయి. గత ఏడాది విడుదలైన మోడల్‌తో పోల్చుకుంటే దీని స్క్రీన్ ఎక్కువే. హయ్యర్ రిఫ్రష్ రేటుకు తోడు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.
Updated Date - 2023-05-20T03:25:48+05:30 IST