ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Spider: పట్టుదల పెంచిన సాలీడు

ABN, First Publish Date - 2023-08-19T04:36:04+05:30

అనగనగా ఓ రాజ్యం. అదో చిన్న రాజ్యం. ప్రవీణుడు అనే రాజు ఉండేవాడు. ప్రజలంతా సంతోషంగా జీవించేవారు. చిన్న రాజ్యం కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించేవాడు రాజు. అక్కడ తిండికి కొదువ ఉండేది కాదు.

అనగనగా ఓ రాజ్యం. అదో చిన్న రాజ్యం. ప్రవీణుడు అనే రాజు ఉండేవాడు. ప్రజలంతా సంతోషంగా జీవించేవారు. చిన్న రాజ్యం కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించేవాడు రాజు. అక్కడ తిండికి కొదువ ఉండేది కాదు. రాజుగారు అడవికి వేటకు వెళుతూ.. కుటుంబాన్ని.. ప్రజలను బాగా చూసుకునేవారు. దీంతో ప్రవీణుడంత మంచి రాజు ఎక్కడా ఉండడు.. అంటూ వేనోళ్ల జనాలు పొగడటం ఆరంభించారు.

ఒక రోజు అనుకోకుండా తనకు వందల కిలోమీటర్లు ఉండే పెద్ద రాజ్యం ఉన్నట్లుండి దండెత్తింది. అసలే సైనికులు తక్కువ. అయితేనేం ప్రజలు స్వచ్ఛందంగా సైనికుల్లా చేరారు. ఘోర యుద్ధం జరుగుతోంది. చూస్తుండగానే తన సైనికులు నేలకొరిగిపోయారు. యుద్ధరంగంలోంచి ప్రవీణుడు పరిగెత్తుకెళ్లాడు. తన గుర్రమెక్కి వేగంగా ఓ గుహ దగ్గరకు వెళ్లాడు. ఆ గుహ అంతా చిమ్మచీకటి. రాజుకు గాయాలు తగిలాయి. తినటానికి తిండి లేదు. రాత్రి అక్కడ పడుకున్నాడు. ఉదయాన్నే ఓ సాలీడు పురుగు చూశాడు. గుహలో రాతి మీద ఎక్కుతోంది. పదుల సార్లు కిందపడింది. అయినా అది పైకి ఎక్కడం మాత్రం ఆపలేదు. దీంతో రాజుకు తెలివి వచ్చింది.

ఓ సాలీడు నేర్పిన గుణపాఠమిది. అసలు నేనెందుకు భయపడాలి? అనుకుంటూ బయటికొచ్చాడు. గుర్రం అక్కడే ఉంది. రాజ్యానికి గుర్రాన్ని పరుగెత్తించాడు. ఇక విజయమో వీర స్వర్గమో అన్నట్లు తన రాజ్యంలోని యువకులను ఉత్తేజపరిచాడు. వారి ఆయుధసామాగ్రితో మళ్లీ కదనరంగంలోకి వచ్చారు. అంత పెద్ద రాజ్యం కూడా ప్రవీణుడు పరాక్రమానికి మోకరిల్లింది. అసలు ఇది నిజమా? కలా? అనుకునేంతగా ఓ చిన్న రాజ్యం సైనికులు ఆ పెద్ద రాజ్యాన్ని ఓడించారు. దీంతో మనసులో ఆ సాలీడుకు కృతజ్ఞత చెప్పుకున్నాడు రాజుగారు.

Updated Date - 2023-08-19T04:36:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising